మామిడి రసంతో మహాదేవుడిని అభిషేకిస్తే?
ఆదిదేవుడు అభిషేక ప్రియుడు ... దోసెడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు సముద్రమంత సంతోషపడిపోతాడు. అనంతమైన పుణ్య ఫలాలను అడగకుండానే ఇస్తుంటాడు. అందుకే శివయ్యకు అభిషేకం చేయడానికి భక్తులు పోటీలు పడుతుంటారు. సాధారణంగా శివాలయాలన్నింటిలోను ఆయనకి ప్రతి రోజు అభిషేకం చేస్తుంటారు.
ఆయా ఆలయాల విశిష్టతను బట్టి, అక్కడి వీలును బట్టి ఈ అభిషేక కార్యక్రమం నీళ్లతోను ... పాలతోను ... పంచామృతాలతోను .. ఫల రసాలతోను జరుగుతూ వుంటుంది. ఒక్కో అభిషేక ద్రవ్యంతో మహాదేవుడిని అభిషేకించడం వలన ఒక్కో ఫలితం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అందువలన ఆయా కాలాల్లో లభించే ఫలాల రసాలతో శివుడిని అభిషేకించడం జరుగుతోంది.
మామిడి పండ్లు వేసవి కాలంలో లభిస్తుంటాయి కనుక, ఆ పండ్ల రసాలతో శివుడికి అభిషేకం చేయించే వాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. శివాలయం అందుబాటులో లేనివాళ్లు, తమ పూజా మందిరంలో గల శివలింగాన్ని కూడా మామిడి పండ్ల రసంతో అభిషేకించవచ్చు. అయితే ఇందుకు తాజా మామిడి పండ్లను మాత్రమే ఉపయోగించవలసి వుంటుంది.
మామిడి పండ్లతో శివుడికి అభిషేకం చేయడం వలన ధన ధాన్యాలు లభిస్తాయని చెప్పబడుతోంది. ధనధాన్యాల వల్లనే సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే సుఖవంతమైన జీవితాన్ని కోరుకునే వాళ్లు, మహాదేవుడిని మామిడి పండ్లతో అభిషేకించాలనే విషయాన్ని మరచిపోకూడదు.