సుదర్శన చక్రం ప్రయోగించబడిన సుందర క్షేత్రం
పుణ్యక్షేత్రాలు దర్శనం మాత్రం చేతనే మానసిక పరమైన ఆనందాన్ని కలిగిస్తాయి ... ఆధ్యాతక పరమైన అనుభూతిని అందిస్తాయి. పురాణ పరమైన ఘట్టాలకు నిదర్శనంగా నిలుస్తూ ... చారిత్రక వైభవాన్ని అందంగా ఆవిష్కరిస్తూ వుంటాయి. అడుగడుగునా భక్తిభావ పరిమళాలను వెదజల్లుతోన్న అలాంటి దివ్యక్షేత్రాలలో ఒకటిగా 'తిరుక్కణ్ణపురం' దర్శనమిస్తుంది. దీనినే 'కణ్వపురం' అని కూడా పిలుస్తుంటారు.
స్వామివారిని గురించి కణ్వమహర్షి ఇక్కడ తపస్సు చేయగా, స్వామి ప్రత్యక్ష దర్శనమిచ్చాడు. ఈ కారణంగానే ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చింది. తిరువారూరు - సన్నిలం సమీపంలో ఈ క్షేత్రం కనిపిస్తుంది. నూటా ఎనిమిది వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగానే కాదు ... పంచ కృష్ణారణ్య క్షేత్రాల్లో ఒకటిగా కూడా ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడ స్వామి శౌరిరాజ పెరుమాళ్ పేరుతోను ... అమ్మవారు కణ్ణపురనాయకి గాను పూజలందుకుంటున్నారు.
స్వామివారి మహిమను గురించి ఇక్కడ కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు. ఒకసారి ఈ ఆలయంపై దాడి జరుగగా స్వామివారు మౌనం వహించారట. దాడికి పాల్పడినవారిని శిక్షించవలసిందేనంటూ అర్చకస్వామి అసహనాన్ని ప్రదర్శించగా, దాడికి పాల్పడిన వారిపై స్వామివారు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడట. ఈ కారణంగా స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనే విషయం మరోమారు స్పష్టమైంది.
ప్రతి రోజు రాత్రి సమయంలో రెండు కేజీల బియ్యం ... రెండు కేజీల నెయ్యితో తయారు చేసిన పొంగలిని స్వామివారికి నివేదించడం ఇక్కడి ప్రత్యేకతగా చెబుతుంటారు. ఎంతో మంది ఆళ్వారులచే కీర్తించబడిన ఇక్కడి స్వామిని దర్శించినంత మాత్రాన్నే సకలశుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసుస్తుంటారు. ఇక విశేషమైన పర్వదినాల్లో స్వామివారికి జరిగే వివిధ వాహన సేవలను చూడటానికి రెండు కళ్ళూ సరిపోవని చెప్పొచ్చు.