అందుకే ఇక్కడ నందీశ్వరుడు కనిపించడట !
మారుమూల గ్రామాలలోని శివాలయాల నుంచి మహా శైవక్షేత్రాల వరకూ ఎక్కడికి వెళ్లినా శివుడికి ఎదురుగా కుదురుగా కూర్చుని నందీశ్వరుడు దర్శనమిస్తూ వుంటాడు. భక్తులు తాము ముక్కంటి దర్శనం కోసం వచ్చిన విషయాన్ని ముందుగా నందీశ్వరుడికి చెప్పుకుని, ఆ తరువాతే శంకరుడిని దర్శించుకుంటూ వుంటారు.
నందీశ్వరుడి ద్వారా ఆదిదేవుడి అనుగ్రహాన్ని పొందడం తేలికగా చెప్పబడుతోంది కనుక, నందీశ్వరుడి కొమ్ముల మధ్యభాగం నుంచి శివలింగ దర్శనం చేసుకుంటూ వుంటారు. సదాశివుడిని విడిచి క్షణమైనా ఉండలేని నందీశ్వరుడు, ఆలయంలో ఆయనకి ఎదురుగా కనిపించకపోతే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి అరుదైన ఆలయం అనంతపురం జిల్లా 'హేమవతి' గ్రామంలో కనిపిస్తుంది.
శివుడు విగ్రహ రూపంలో సిద్ధేశ్వరుడుగా ఉండటం ... ఆయన ఎదురుగా నందీశ్వరుడు లేకపోవడం ఇక్కడి ప్రత్యేకతగా చెబుతుంటారు. ఈ ఆలయంలో స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు లేకపోవడానికి బలమైన కారణమే కనిపిస్తుంది. దక్ష ప్రజాపతి తాను తలపెట్టిన యజ్ఞానికి అల్లుడైన శివుడిని తప్ప అందరినీ ఆహ్వానిస్తాడు. అది అవమానంగానే అనిపించినా మహాదేవుడు ఓర్పు వహిస్తాడు
అయితే ఆహ్వానం లేకపోయినా, కూతురిగా అక్కడికి వెళ్లకుండా సతీదేవి ఉండలేకపోతుంది. ఒంటరిగా వెళ్లడానికి కూడా సతీదేవి సిద్ధపడటంతో, ఆమెకి తోడుగా నందీశ్వరుడిని పంపిస్తాడు శివుడు. అలా సతీదేవితో నందీశ్వరుడు వెళ్లడం వల్లనే ఇక్కడ ఆయన కనిపించడని అంటారు. పురాణపరమైన నేపథ్యంతో పాటు, క్రీ.శ.7 వ శతాబ్దం నుంచి చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఈ క్షేత్రం నేటికీ తనదైన విశిష్టతను చాటుకుంటూనే వుంది.