హనుమ ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడట!
రామాయణంతో ముడిపడిన అనేక ప్రదేశాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా అలరారుతున్నాయి. ఈ నేపథ్యంలో సీతారామలక్ష్మణులతో కూడిన హనుమంతుడు గల ఆలయాలు ... హనుమంతుడు మాత్రమే కొలువైన ఆలయాలు దర్శనమిస్తూ వుంటాయి. ఈ క్షేత్రాలలో అడుగుపెట్టడమే అదృష్టంగా ... అక్కడి ఆలయ దర్శనమే పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తుంటారు. అలాంటి క్షేత్రాలలో ఒకటి .. ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా చెప్పుకునే 'సిమ్లా'లో కనిపిస్తుంది.
ఇక్కడి 'జాకూ' కొండపై హనుమంతుడి పాదముద్రలు కనిపిస్తూ వుంటాయి. త్రేతాయుగంలో హనుమంతుడు ఈ కొండపైకి రావడం వలన ఆయన పాదముద్రలు పడ్డాయని స్థలపురాణం చెబుతోంది. రామరావణ యుద్ధంలో మేఘనాథుడితో తలపడిన లక్ష్మణుడు, ఆయన ధాటికి తట్టుకోలేక కుప్పకూలిపోతాడు. లక్ష్మణుడిని తిరిగి ఈ లోకంలోకి తీసుకురావడం కోసం హనుమంతుడు 'సంజీవని' పర్వతం తీసుకువస్తాడు.
లక్ష్మణుడు తేరుకున్నాక రాముడి ఆదేశం మేరకు ఆ సంజీవని పర్వతాన్ని తిరిగి యథా స్థానంలో వుంచడం కోసం హనుమంతుడు గగన మార్గంలో బయలుదేరుతాడు. బాగా అలసిపోయిన ఆయన, మార్గమధ్యంలో కాసేపు విశ్రాంతి తీసుకోవడం కోసం ఇక్కడి కొండపై దిగినట్టు చెబుతారు. హనుమంతుడు మహా బలవంతుడు కావడం వలన ... ఆయన చేతిలో సంజీవని పర్వతం ఉండటం వలన, ఈ కొండపై ఆగగానే ఆ బరువుకి అది కొంచెం కుంగిపోయిందట. అంతే కాకుండా ఆయన పాదముద్రలు బలంగా ... స్పష్టంగా ఈ కొండపై పడ్డాయట.
అందువలన ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఈ కొండపై హనుమంతుడు పూజించబడుతూ వస్తున్నాడు. ఇక్కడి స్థల మహాత్మ్యానికి తగినట్టుగానే అత్యధిక సంఖ్యలో కోతులు కనిపిస్తూ వుంటాయి. ఇక ఇక్కడ ఏర్పాటు చేయబడిన 108 అడుగుల హనుమంతుడి విగ్రహం, సిందూర వర్ణాన్ని కలిగి ఈ క్షేత్రానికి మరింత విశిష్టతను తెచ్చిపెట్టింది. దసరా పండుగ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ... సేవలు నిర్వహిస్తూ వుంటారు. ఈ సందర్భంగా ఈ క్షేత్రానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. స్వామివారి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ వుంటారు.