ఆర్తితో పిలిస్తే పలికే అమ్మవారి క్షేత్రం ఇదే !
ఆదిపరాశక్తి అయిన అమ్మవారు లోక కల్యాణం కోసం అనేక ప్రాంతాలలో ఆవిర్భవించింది. తన బిడ్డల వంటి భక్తుల సంరక్షణ చూసుకోవడం కోసం, ఆ తల్లి సాధారణమైన స్త్రీగా జన్మించి ... కారణజన్మురాలు అనిపించుకుని ... గ్రామదేవతగా మారిపోయిన సందర్భాలు ఎన్నో వున్నాయి. అలా అమ్మవారు మానవ జన్మనెత్తి, తన ప్రత్యేకతను చాటుకుని అక్కడివారితో పూజలు అందుకున్న ప్రదేశాలు నేడు ప్రసిద్ధ క్షేత్రాలుగా అలరారుతున్నాయి.
అలాంటి వాటిలో ఒకటిగా నర్రవాడ వెంగమాంబ క్షేత్రం కనిపిస్తుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి సమీపంలో గల ఈ క్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర వుంది. సామాన్య స్త్రీ గా జన్మించిన అమ్మవారు, 'వెంగమాంబ' పేరుతో అక్కడి ప్రజానీకాన్ని ప్రభావితం చేసింది. దుర్మార్గుల బారి నుంచి మంచివారిని కాపాడటం కోసం ఎన్నో త్యాగాలకు పాల్పడింది.
ఇందుకోసం ఆమె పడిన ఆరాటమే, వెంగమాంబ సాధారణ స్త్రీ కాదని ప్రజలు గ్రహించేలా చేసింది. గుండెల్లో గుడిని కట్టుకుని ఆమెను దేవతగా పూజించేలా చేసింది. గ్రామ దేవతలా ప్రజలు ఆమె మూర్తిని ప్రతిష్ఠించుకున్నా, శిష్ట సాంప్రదాయం ప్రకారం ఆమెకి పూజాభిషేకాలు నిర్వహించడం ఇక్కడి విశేషం. సంతానం లేక బాధపడుతోన్న దంపతులు ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటే, అనతికాలంలోనే వారి కోరిక నెరవేరుతుందని చెబుతుంటారు. ఈ కారణంగానే నూతన దంపతులు ఈ తల్లి దర్శనం చేసుకుంటూ వుంటారు.
ప్రతి సంవత్సరం 'జ్యేష్ఠ పౌర్ణమి' తరువాత వచ్చే ఆదివారం నుంచి అయిదు రోజుల పాటు ఇక్కడ తిరునాళ్లు జరుగుతుంటాయి. పూజల పరంగాను ... సేవల పరంగాను ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేకతను కలిగి వుంటుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనడం కోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగే ఎడ్ల పందాలను చూసి తీరవలసిందే.