అనారోగ్యాన్ని తొలగించే అభిషేకం !
పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నప్పుడు అక్కడ గల ఆచారాలు ... విశ్వాసాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. కొంతమంది ఈ ఆచారాలను గౌరవిస్తే ... మరికొంత మంది వాటిని కొట్టిపారేయడం జరుగుతూ వుంటుంది. విశ్వాసమనేది మనిషికి ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిస్తుంది కనుక, నమ్మి అనుసరించే వాళ్లు ... ఆచరించే వాళ్లు ఎక్కువగా కనిపిస్తూ వుంటారు.
అలాంటి బలమైన విశ్వాసం ఒకటి 'సురుటుపల్లె'లో గల 'శ్రీ పళ్లికొండేశ్వర స్వామి' క్షేత్రంలో కనిపిస్తుంది. సాధారణంగా కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించడం వలన ... కొన్ని తీర్థాలను సేవించడం వలన అనారోగ్యాలు తొలగిపోతాయని చెబుతుంటారు. కానీ ఫలానా అనారోగ్యం మాత్రమే తొలగించబడుతుందనే క్షేత్రాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి క్షేత్రాల్లో ఇది ఒకటిగా దర్శనమిస్తుంది.
ఈ క్షేత్రంలో కొలువైన 'జ్వరదేవత' ప్రత్యేక పూజలు అందుకుంటూ వుంటుంది. తరచూ జ్వరంతో బాధపడుతోన్న భక్తులు, చిత్రమైన ఆకృతిలో కనిపించే ఈ దేవతను దర్శించుకుంటూ వుంటారు. మిరియాల రసంతో అభిషేకం చేయించి, అనంతరం దానిని తీర్థంగా స్వీకరిస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన జటిలమైన జ్వరాల బారి నుంచి బయటపడటం జరుగుతుందని అనుభవపూర్వకంగా చెబుతుంటారు.