కోరిన వరాలను కురిపించే కొండ !
సాధారణంగా హరిహరులు ఆవిర్భవించిన క్షేత్రాలన్నీ కూడా కొండలపైనే దర్శనమిస్తూ వుంటాయి. ఇబ్బందులు ... కష్టాలు ఎదురైనా కాస్త ఓపిక తెచ్చుకుని ఎవరైతే తమ సన్నిధికి చేరుకుంటారో వాళ్లని అనుగ్రహిద్దామని అనుకుంటున్నట్టుగా శివకేశవులు కనిపిస్తుంటారు. వాళ్ల పరీక్షలో నెగ్గుతామన్నట్టుగా భక్తులు వేల సంఖ్యలో ఆయా క్షేత్రాలకు వెళుతూనే వుంటారు. కొండంత మనసున్న హరిహరులను మెప్పించి వరాలను పొందుతూనే వుంటారు.
అలా భక్తజనకోటిచే నిత్యనీరాజనాలు అందుకుంటోన్న క్షేత్రం 'ఆగిరిపల్లి'లో కనిపిస్తుంది. కృష్ణా జిల్లా విజయవాడకు సమీపంలో గల ఈ క్షేత్రం, కృతయుగం నుంచి విలసిల్లుతున్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. కొండ పైభాగంలో సదాశివుడు ... దిగువ భాగంలో లక్ష్మీదేవి సమేతంగా నృసింహస్వామి వారు దర్శనమిస్తుంటారు. నృసింహుడు వ్యాఘ్ర రూపంలో వుండటం ఈ క్షేత్ర విశిష్టతగా చెబుతుంటారు.
హరుహరులకు ఈ కొండ ప్రదేశం ఎంతగానో నచ్చిందనీ, అందువల్లనే వాళ్లు స్వయంభువులుగా ఇక్కడ ఆవిర్భవించారని స్థలపురాణం చెబుతోంది. అయితే కొండలపై ఎక్కువగా కొలువుదీరే నృసింహస్వామి, ఈ క్షేత్రంలో కొండ దిగువున దర్శనమిస్తూ వుండటం విశేషంగా అనిపిస్తూ వుంటుంది. కైలాసవాసుడు ... వైకుంఠనాథుడు ఒకే ప్రదేశంలో కొలువైన ఈ క్షేత్రాన్ని దర్శించే అవకాశం వచ్చిందంటే అది పూర్వజన్మ సుకృతమనే చెప్పాలి.
ఇక కొండకింద నుంచి పైకి నడచివెళ్లే మార్గంలో రాముడు ... కృష్ణుడు ... శ్రీనివాసుడు ప్రత్యేక ఆలయాల్లో కొలువై భక్తులను అనుగ్రహిస్తుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయాలను అలరారుతోన్న కారణంగా, కొండను ఎక్కడం పెద్దగా శ్రమ అనిపించదు. ఇక్కడి 'వరాహ పుష్కరిణి' మహిమాన్వితమైనదిగా చెబుతుంటారు. అపురూప ఆలయాల సమాహారంగా కనిపించే ఈ క్షేత్రంలో అడుగుపెట్టినంత మాత్రాన్నే సకలశుభాలు చేకూరతాయని అంటారు. మాఘమాసంలో స్వామివారికి ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా జరిగే రథోత్సవాన్ని చూసి తీరవలసిందే.