పాండవులను అనుగ్రహించిన పరమేశ్వరుడు
పాండవులు తమ వనవాస కాలంలో అనేక క్షేత్రాలను దర్శిస్తూ వెళ్లారు. ఆయా క్షేత్రాల విశిష్టతను గురించి తెలుసుకుంటూ, అక్కడ పూజాభిషేకాలు నిర్వహించారు. ఈ కారణంగానే కొన్ని క్షేత్రాలను దర్శించినప్పుడు, అక్కడ పాండవులకు సంబంధించిన విశేషాలు తెలుస్తుంటాయి ... ఆనవాళ్లు కనిపిస్తూ వుంటాయి. అలాంటి క్షేత్రాలలో 'వేములవాడ' ఒకటిగా దర్శనమిస్తూ ఉంటుంది.
పురాణకాలం నాటిదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం కరీంనగర్ సమీపంలో విలసిల్లుతోంది. నారద మహర్షి అభ్యర్థన మేరకు భూలోకానికి వచ్చిన పరమశివుడు, భక్తులను ఉద్ధరించడం ఇక్కడ రాజరాజేశ్వరుడుగా ఆవిర్భవించాడు. ఇంతటి విశిష్టమైన ఈ క్షేత్రాన్ని ద్వాపరయుగంలో పాండవులు దర్శించుకున్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోలేదు.
ఈ క్షేత్ర మహాత్మ్యం గురించి తెలుసుకుని రాజరాజేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో అరాధించారు. రాజరాజేశ్వరుడి అనుగ్రహంతో శక్తిమంతమైన ఆయుధాలను పొందారు. ఇక రాజరాజేశ్వరీదేవిని పూజించిన 'ద్రౌపతి' ... ఆ తల్లి అనుగ్రహంతో అఖండ సౌభాగ్యాన్ని పొందింది. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన ... స్వామివారి అనుగ్రహాన్ని సంపాదించడం వల్లనే కౌరవులపై పాండవులు విజయాన్ని సాధించినట్టు చెబుతుంటారు.