భగవంతుడు అలా ముందుకు నడిపిస్తాడు
జయదేవుడికి కృష్ణుడంటే ప్రాణం ... నిరంతరం ఆయన ఆలోచనలతోనే కాలం గడుపుతుంటాడు. అనునిత్యం రాధామాధవులు ఆయనకి కనిపించేలా ఆడుతూ ... పాడుతూ వుంటారు. వారి మధ్యగల శృంగార సన్నివేశాలను ఆయన తన రచనల ద్వారా అద్భుతంగా ఆవిష్కరిస్తూ వుంటాడు. శ్రీకృష్ణుడి ప్రేమతత్త్వాన్ని గురించి పాడుతూ పరవశించిపోతుంటాడు.
ఆయన నోటివెంట రాధామాధవుల గానామృతాన్ని విన్న ఆ గ్రామపెద్దలు ఆశ్చర్యపోతారు. ఆయనలోని శృంగారపరమైన భావాలను, భగవంతుడికి ఆపాదించవద్దంటూ అసహనాన్ని ప్రదర్శిస్తారు. ఊహించని ఈ సంఘటనకు జయదేవుడు బిత్తరపోతాడు. సాక్షాత్తు రాధామాధవులు తన కనులముందు ఆడిపాడుతూ వుండటం చూసి తాను రాశానని ఆయన చెప్పిన మాటలను వాళ్లు కొట్టిపారేస్తారు.
దాంతో తనకి రాధాకృష్ణులు నిజంగానే కనిపిస్తున్నారా ? లేదంటే తాను భ్రమపడుతున్నానా ? అనే సందేహం ఆయనలో తలెత్తుతుంది. తన రచనలు కృష్ణుడికైనా ఆనందాన్ని కలిగిస్తున్నాయా ? అసలు వాటికి ఆయన ఆమోదం లభించిందా ? అనే ఆలోచనలు ఆయన్ని సతమతం చేస్తుంటాయి. ఈ విషయంలో తనకి కావలసిన సమాధానం లభిస్తేనే, రచన కొనసాగించాలని నిర్ణయించుకుంటాడు.
అలా ఆ రాత్రి నిద్రలోకి జారుకున్న ఆయనకి, తెల్లవారుతుండగా ఎక్కడి నుంచో వేణుగానం లీలగా వినిపిస్తూ వుంటుంది. ఆ వేణుగానం వినిపిస్తోన్న దిశగా ఆయన వడివడిగా అడుగులువేస్తూ ముందుకుసాగుతాడు. అక్కడి నదిలో రాధతో కలిసి కృష్ణుడు జలకాలాడుతూ ఉండటం చూసి ఆనందంతో పొంగిపోతాడు. ఆయన చూసిన ఆ దృశ్యం భ్రమ కాదు .. నిజమేనన్నట్టుగా రాధాకృష్ణులు ఒక ప్రతిమగా మారిపోతారు.
ఆ ప్రతిమ జయదేవుడు నుంచున్న చోటికి కొట్టుకువస్తుంది. ఆ ప్రతిమను హృదయానికి హత్తుకుని తన ఆశ్రమానికి తీసుకువచ్చిన జయదేవుడు, అనునిత్యం ఆ ప్రతిమను పూజిస్తూ తన రచనలను కొనసాగిస్తాడు.