అనుకోని సంఘటనే ఆ దైవంవైపు నడిపిస్తుంది
కనకదాసు భక్తుడిగా మారడానికి ముందు 'తిమ్మనాయకుడు' అనే పేరుతో పిలవబడ్డాడు. తండ్రిలానే యుద్ధవిద్యల్లో రాణించిన ఆయన, రాజ్య రక్షణ భారాన్ని కూడా వహిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే తనపై మనసుపడిన 'లచ్చి'ని వివాహం చేసుకోవాలనుకుంటాడు. ఈ విషయంలో 'లచ్చి' కూడా తన తండ్రి 'మల్లన్న' ను ఎదిరించి, తిమ్మనాయకుడితో వివాహానికి సిద్ధపడుతుంది.
వారి వివాహ వేడుక జరుగుతోన్న సమయంలోనే, రాజ్య సరిహద్దుల్లోకి శత్రువులు ప్రవేశించారనే వర్తమానం అందుతుంది. దాంతో పెళ్లిపీటల మీద నుంచి లేచివెళ్లిన తిమ్మనాయకుడు, ప్రాణాలకు తెగించి శత్రువులతో పోరాడతాడు. యుద్ధభూమిలో తీవ్రమైన గాయాలతో ఆయన కుప్పకూలిపోయినట్టుగా సమాచారం అందడంతో, తిమ్మనాయకుడి తల్లి కన్నీళ్ల పర్యంతమవుతుంది. ఆయన సన్నిహితులు కూడా విచారాన్ని వ్యక్తం చేస్తుంటారు.
అదే సమయంలో తిమ్మనాయకుడు మరింత తేజస్సుతో అక్కడికి వస్తాడు. అతణ్ణి అలా చూసి అంతా ఆశ్చర్యపోతారు. ఆగిపోయిన వివాహాన్ని జరిపించడానికి రంగాన్ని సిద్ధం చేయబోతారు. తనకి పెళ్లి ఆలోచన లేదనీ, తాను ప్రయాణించవలసిన మార్గం ... చేరుకోవలసిన గమ్యం వేరే ఉన్నాయంటూ తిమ్మనాయకుడు వెనుదిరుగుతాడు. కొడుకు తిరిగివచ్చాడనే ఆనందం కొంతసేపైనా లేకుండా పోవడంతో, ఆయన తల్లి నుంచున్నపళంగా కుప్పకూలిపోతుంది.
యుద్ధభూమిలో తీవ్రంగా గాయపడిన తిమ్మనాయకుడిని వేంకటేశ్వరస్వామి కాపాడాడనీ, ఆ స్వామి అనుగ్రహంతో ఆయన జీవితం ఆధ్యాత్మిక ప్రపంచం వైపు మళ్లిందనే విషయం ఎవరికీ తెలియదు. అందుకే తిమ్మనాయకుడు ధోరణిలో హఠాత్తుగా ఆ మార్పు ఎందుకు వచ్చిందో తెలియక వాళ్లంతా అలాగే చూస్తుండిపోతారు.