నవగ్రహ దోషాలను నివారించే నారసింహ క్షేత్రం
మానవుల జీవితాలను ప్రభావితం చేయడంలో నవగ్రహాలు కీలమైన పాత్రను పోషిస్తుంటాయి. అందువల్లనే గ్రహాల అనుకూలతను బట్టి, నిర్ణయాలు తీసుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కో గ్రహ సంబంధమైన దోషం ఒక్కోవిధంగా ఇబ్బందిపెడుతూ వుంటుంది. అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఎవరిస్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేస్తుంటారు. ఫలానా క్షేత్రానికి వెళితే ఫలానా దోషం నివారించబడుతుందని ఎవరైనా చెప్పగానే వెంటనే అక్కడికి ప్రయాణం కడుతూ వుంటారు.
ఇలాంటి వారికి 'అహోబిలం' ఓ అరుదైన వరంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. విశిష్టమైన ఈ క్షేత్రంలో 'నవనారసింహ రూపాలు' దర్శనమిస్తూ వుంటాయి. ఒక్కో రూపాన్ని దర్శించడం వలన ఒక్కో గ్రహదోషం తొలగిపోతుందని ఇక్కడి స్థలపురాణం చెబుతూ వుంటుంది. సూర్యగ్రహ సంబంధమైన దోషం వున్నవాళ్లు 'భార్గవ నారసింహుడు'ను ... చంద్రగ్రహ దోషం గలవాళ్లు 'కారంజనారసింహుడు' ను దర్శించుకుంటూ వుంటారు.
ఇక కుజగ్రహ దోషం గల వాళ్లు 'జ్వాలా నారసింహుడు' ను ... బుధగ్రహ దోషం గల వాళ్లు 'పావన నారసింహుడు' ను, గురుగ్రహ సంబంధమైన దోషం వున్న వాళ్లు 'అహోబిల నారసింహుడు'ను దర్శించుకుంటూ వుంటారు. ఇక శుక్రగ్రహానికి గాను 'మాలోల నారసింహుడు' ... శని గ్రహానికి గాను 'యోగానారసింహుడు' ... రాహు గ్రహానికి గాను 'వరాహ నారసింహుడు' ... కేతు గ్రహ సంబంధమైన దోషానికి గాను 'ఛత్రవట నారసింహుడు'ని దర్శించుకుంటారు.
ఇలా నవగ్రహ సంబంధమైన దోషాలతో బాధలు పడుతోన్నవాళ్లు ఇక్కడి నవనారసింహులను దర్శించుకుంటూ వుంటారు. ఆయా దోషాల నుంచి స్వామివారి అనుగ్రహంతో బయటపడుతూ వుంటారు.