నృసింహస్వామియే ఇలా వరమిచ్చాడట !
వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడ కనిపించే విశేషాలు ... వినిపించే కథనాలు ఆసక్తికరంగా అనిపిస్తూ వుంటాయి. పుణ్యక్షేత్రంతో ... అక్కడి ప్రధాన దైవంతో ... భక్తుల మనోభావాలతో ఈ విశేషాలు ముడిపడివుంటాయి. ఈ నేపథ్యంలో భక్తుల నమ్మకానికే వదిలేసే సంఘటనలు కొన్ని వుంటాయి. మరికొన్ని సంఘటనలు అక్కడి ఆచారంగా మారిపోతుంటాయి.
అలాంటి మహిమాన్వితమైన సంఘటన ఒకటి మనకి 'పెంచెలకోన లక్ష్మీనృసింహస్వామి' క్షేత్రంలో కనిపిస్తుంది. పెంచెలకోనకు వెళ్లే మార్గంలో భక్తులకి ఒక శిల దర్శనమిస్తుంది. ఈ శిలను స్వామివారి భక్తుడైన 'గొల్లబోయడు' గా చెబుతుంటారు. పశువుల కాపరియైన ఈ గొల్లబోయడు, ప్రతిరోజు వాటిని మేపడానికి ఈ ప్రదేశానికి వచ్చేవాడట.
ఒకసారి ఆయనకి దర్శనం ఇచ్చిన స్వామివారు, ఈ ప్రదేశంలో తాను ఆవిర్భవించిన విషయాన్ని గ్రామపెద్దలకు తెలియజేయమని చెబుతాడు. గ్రామానికి చేరుకునేంత వరకూ వెనుదిరిగి చూడకుండా వెళ్లమని అంటాడు. ఆశ్చర్యానందాలకు లోనైన గొల్లబోయడు, అలాగేనని తలాడిస్తూ వెనుదిరుగుతాడు. అలా కొంతదూరం వెళ్లి .. వెనక్కి తిరిగి చూడవద్దని స్వామి ఎందుకు చెప్పాడో తెలుసుకోవాలనే ఆసక్తితో వెనుదిరుగుతాడు.
స్వామివారి ఆదేశాన్ని ఉల్లంఘించిన కారణంగా అక్కడే శిలగా మారిపోవడం మొదలుపెడతాడు. ఆ సమయంలోనే స్వామివారిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆవేదన చెందవలసిన అవసరంలేదనీ, ఆ శిలను అతని పేరుతో 'పెంచెల గొల్లబోయాడు' గా భక్తులు పిలుచుకుంటారనీ ... ఆ శిలను దర్శించిన తరువాతనే తనని దర్శిస్తారంటూ స్వామివారు వరాన్ని అనుగ్రహించాడట. ఈ విషయాన్ని గురించి తెలిసినవాళ్లు ముందుగా ఈ శిలను దర్శించుకుని, ఆ తరువాతనే స్వామివారి సన్నిధికి చేరుకుంటూ వుంటారు.