గోమాతలు పవిత్రం కావడానికి కారణమిదే !
శ్రీమహావిష్ణువు గోమాతకు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. గోవుల పట్ల తనకి గల ఇష్టం కారణంగానే ఆయన గోకులానికి చేరుకొని గోపాలకుడిగా తన ముచ్చట తీర్చుకున్నాడు. మీగడపాలను ... వెన్నముద్దలను ఆరగిస్తూ తన కోరిక నెరవేర్చుకున్నాడు. ఇక శ్రీనివాసుడుగా ఆయన భూలోకానికి వచ్చినప్పుడు కూడా ముందుగా ఆవుపాలనే సేవించాడు. ఇప్పటికీ తిరుమలలో శ్రీనివాసుడుకి ఉదయాన్నే ఆవుపాలనే నైవేద్యంగా సమర్పిస్తూ వుండటం విశేషం.
సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి మనసు గెలుచుకున్న గోవులలో, కపిల గోవులు మరింత ఉత్తమమైనవిగా ... పవిత్రమైనవిగా చెప్పబడుతుంటాయి. అందుకు కారణం పరమశివుడి అనుగ్రహమేనని అంటారు. ఒకసారి కపిలగోవులు ... దూడలు కైలాసగిరి ప్రాంతంలో సంచరించసాగాయి. తల్లిపాలను దూడలు కడుపునిండుగా తాగుతూ వాటి వెంట నడవసాగాయి. ఆ సమయంలో వాటి నోటికి అంటిన నురుగ, ధ్యానంలో వున్న సదాశివుడిపై పడిందట.
తన ధ్యానానికి భంగం కలిగించినది ఎవరా అన్నట్టుగా ఆయన తీక్షణంగా ఆ వైపు చూస్తాడు. తీక్షణమైన ఆ చూపులు సోకగానే, తెల్లని వర్ణంలో గల అక్కడి ఆవులన్నీ ఒక్కసారిగా నల్లబడిపోయాయి. విషయాన్ని గ్రహించిన బ్రహ్మదేవుడు క్షణాల్లో అక్కడికి చేరుకుంటాడు. గోవు నురగ పవిత్రతను గురించి శివుడికి వివరించి చెబుతాడు. ఆ సమయంలోనే ... గోవులతో శ్రీహరికి గల అనుబంధం గురించిన ప్రస్తావన వస్తుంది.
అమాయకంగా తన వైపు చూస్తోన్న ఆవుదూడలను ఆదిదేవుడు ఆప్యాయంగా నిమురుతాడు. తన చూపు సోకిన కారణంగా గోవులలో 'కపిల గోవులు' ఉత్తమమైనవిగా ప్రసిద్ధి చెందుతాయంటూ వాటికి వరాన్ని ఇస్తాడు. అందువల్లనే కపిల గోవులు తమదైన విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంటాయి ... స్వామివారి సేవలో తరిస్తూ ఆయన భక్తులచే ప్రత్యేక పూజలందుకుంటూ వుంటాయి.