పాతివ్రత్య మహిమ అలాంటిది మరి !
సీత ... సావిత్రి ... అనసూయ ... అరుంధతి ... రేణుకాదేవి ... వంటి ఎంతో మంది పతివ్రతలు నడయాడిన కారణంగా, ఈ పుణ్యభూమి మరింత పవిత్రమైంది. తన పాతివ్రత్య మహిమతో ఒకరు ఇసుకతో కుండను తయారుచేస్తే ... మరొకరు సూర్యోదయాన్నే నిలువరించారు. ఒకరు యముడినే ఎదిరిస్తే ... ఇంకొకరు త్రిమూర్తులనే పసిబిడ్డలుగా చేసి ఆడించారు.
పతిసేవను వ్రతంగా భావించి ... పాతివ్రత్య మహిమను లోకానికి చాటిన వీరి సరసన, అంబరీషుడి భార్య అయిన 'కల్యాణి' కూడా కనిపిస్తుంది. శ్రీమహా విష్ణువు పరమభక్తులలో ఒకరైన అంబరీషుడి జీవితంలోకి అర్థాంగిగా కల్యాణి అడుగుపెడుతుంది. పతిసేవకు మించిన భాగ్యంలేదని భావిస్తూ, అనుక్షణం ఆయన సేవలో ఆమె తరిస్తూ ఉండేది. అంబరీషుడు రాజ్యభోగాలను అనుభవిస్తూ వుండగా ఆమె ఎంత సంతోషంగా ... సంతృప్తిగా ఉండేదో, ఆయన అన్నింటినీ వదలుకుని ఆశ్రమ జీవితం గడిపేటప్పుడు కూడా ఆమె అంతే సంతోషంగా ఉండేది.
మహా సౌదర్యవతియైన ఆమె, ఒకసారి దేవేంద్రుడి కంటపడుతుంది. కల్యాణిపై మనసుపడిన దేవేంద్రుడు ఎలాగైనా ఆమెను పొందాలని నిర్ణయించుకుంటాడు. అంబరీషుడు ఆశ్రంలో లేని సమయం చూసి, ఆయన రూపంలో కల్యాణికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తాడు. రూపం భర్తదే అయినా వచ్చినది ఆయన కాదనే విషయాన్ని కల్యాణి గ్రహిస్తుంది. తన భర్త రూపంలో తనని తాకడానికి ప్రయత్నించినది ఎవరైనా, నిజరూపాన్ని పొంది దహించబడతారని అంటుంది.
అంతే నిజరూపాన్ని పొందిన దేవేంద్రుడు నుంచున్న చోటునే దహించబడుతుంటాడు. ఆమె పాతివ్రత్య మహిమ ఎంతటిదో తెలుసుకున్న దేవేంద్రుడు, ఆ మంటల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూ వుంటాడు. ఈ విషయం తెలుసుకున్న శచీదేవి, వెంటనే అక్కడికి చేరుకొని తన భర్త తప్పును మన్నించమని కోరుతుంది. దాంతో కల్యాణి శాంతించి దేవేంద్రుడిని క్షమించి వదిలేస్తుంది.