సాయిబాబా చూపిన విభూతి మహిమ
శిరిడీ సాయిబాబా చూపే మహిమలు చిత్ర విచిత్రంగా వుంటాయి. తనని నమ్మినవారిని నీడలా ఉంటూ రక్షించే బాబా, తనని నమ్మని వాళ్లను సైతం అవసరాల నుంచి ఆపదల నుంచి గట్టెక్కిస్తూ వుంటాడు. సమస్యల సుడిగుండం నుంచి తమని బయటపడేసింది బాబాయేనని గ్రహించినవాళ్లు, సహజంగానే ఆయన భక్తులుగా మారిపోతుంటారు. ఈ నేపథ్యంలో బాబా ఎక్కడ కొలువైవున్నా, అక్కడి భక్తులకు ఆయన మహిమలు అనుభవంలోకి వస్తూనే వుంటాయి.
అలా సాయిబాబా కొలువుదీరిన ఊళ్లలో 'కట్టకమ్మగూడెం' ఒకటిగా కనిపిస్తుంది. కోదాడ సమీపంలో గల ఈ గ్రామం నేడు బాబా లీలావిశేషాలకు వేదికగా అలరారుతోంది. రమణమ్మ అనే ఓ భక్తురాలి సంకల్పం మేరకు బాబా ఇక్కడ కొలువై ఉన్నట్టుగా చెబుతుంటారు. ఫలాపేక్ష రహితంగా ఆమె ఇక్కడి బాబాకు ... ఆయన భక్తులకు కూడా సేవలు చేస్తుంటుంది. ఇక్కడి బాబా సన్నిధిలో మంచు తుప్పరలా విభూతి కురవడం విశేషంగా చెబుతుంటారు. ఈ విభూతి కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వస్తుంటారు.
ఈ విభూతిని ధరించడం వలన ... ఔషధంగా రవ్వంత సేవించడం వలన అనతికాలంలోనే ఆయురారోగ్యలు ... సుఖసంతోషాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. ఒకసారి శశికళ అనే ఒక యువతి కుటుంబసభ్యుల మాట కాదనలేక ఇక్కడి బాబాను దర్శించుకుందట. ఆ రాత్రి అక్కడ నిద్రచేసి .. మరునాడు ఉదయమే బాబా ఇచ్చే విభూతి తీసుకుని వెళ్లమని అక్కడివాళ్లు చెప్పారట. బాబా విభూతి కురిపించడం ఒట్టిమాట అనుకున్న ఆ యువతి, అయిష్టంగానే బాబా సన్నిధిలో నిద్రచేసింది.
ఒకరాత్రివేళ హఠాత్తుగా మెలకువరావడంతో యథాలాపంగా ఆమె బాబా విగ్రహంవైపు చూసింది. తెరలు తెరలుగా ఆయన సన్నిధిలో కురుస్తోన్న విభూతిని చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయింది. మరునాడు ఉదయం ఆ విభూతిని ప్రసాదంగా తీసుకుని ఓ బాక్సులో పెట్టుకుని తన ఊరుకి చేరుకుంది. అప్పటి నుంచి ఆ బాక్సులోని విభూతి దానంతట అది పెరుగుతూ తగ్గుతూ వుండటంతో ఆమెకి ఆశ్చర్యమే కాదు ... బాబా పట్ల విశ్వాసము కలిగింది. ఇలాంటి అనుభవాలెన్నో కట్టకమ్మగూడెంలో వినిపిస్తోన్న కారణంగా ఈ బాబా మహిమాన్వితుడని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.