ఈ పూలతో పూజిస్తే శనిదేవుడు కరుణిస్తాడు

ఈ పూలతో పూజిస్తే శనిదేవుడు కరుణిస్తాడు
శని అనే పేరు వినగానే ఎంతటివారైనా భయపడిపోతుంటారు. అందుకు కారణం ఆయన సృష్టించే సమస్యలు .. పెట్టే బాధలు అని చెప్పవచ్చు. సాధారణంగా పరిస్థితులకు భయపడి వాటికి దూరంగా పారిపోవడం జరుగుతూ వుంటుంది. కానీ శని విషయంలో అలా పారిపోవడం కుదరదు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఆయన బారిన పడవలసిందే ... జీవితమంటే ఏమిటో తెలుసుకోవలసిందే.

ఇక శనిదేవుడు తమ జీవితంలోకి ప్రవేశించాడనే విషయం తెలిసిన దగ్గర నుంచి ఎవరికీ కూడా నిద్రపట్టదు. ఆయన సృష్టించే అనూహ్యమైన పరిస్థితులను ఎదుర్కోగలుగుతామో .. లేదోననే ఆందోళన వారిని పట్టిపీడిస్తూ వుంటుంది. శని దేవుడు అనుగ్రహమే తమని ఆ పరిస్థితుల నుంచి బయటపడేయగలదని భావిస్తారు. ఆయన ఆవిర్భవించిన వివిధ క్షేత్రాలకి వెళ్లి, ఆ స్వామిని శాంతింపజేసే పూజలు నిర్వహించడం మొదలుపెడతారు.

అయితే శని దేవుడిని నిత్యం అర్చిస్తూ కూడా ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శనిదేవుడికి నీలం వర్ణంలో గల 'శంఖు పుష్పాలు' ప్రీతికరమైనవి. ఆయన మనసు గెలుచుకోవడానికి శంఖు పుష్పాలకు మించిన ఆయుధంలేదని అంటారు. ప్రతినిత్యం ఈ పూలను సేకరించి, అత్యంత భక్తి శ్రద్ధలతో శని దేవుడిని పూజించాలి. ఈ విధంగా శనికి ఎంతో ఇష్టమైన ఈ పూలను సమర్పించడం వలన ఆయన ఆనందిస్తాడు ... ఆ సంతోషంతో అనుగ్రహిస్తాడు.

More Bhakti Articles