దుఃఖాన్ని దహించే దివ్య క్షేత్రం
జీవితం కష్టసుఖాల కలయికగా కొనసాగుతూ వుంటుంది. అయితే కష్టాలతో ఎక్కువకాలం కలిసి ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు నిరాశా నిస్పృహలకు లోనవుతారు. తమని ఈ బాధల నుంచి దరిచేర్చమని ఆ భగవంతుడిని వేడుకుంటూ వుంటారు. అలాంటివారి మొరను ఆలకించడానికే శ్రీమహావిష్ణువు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అలా ఆ స్వామి కొలువుదీరిన పవిత్ర క్షేత్రాల్లో ఒకటిగా 'సాలగ్రామం' కనిపిస్తుంది.
నూటా ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోన్న ఈ క్షేత్రం, నేపాల్ రాజధాని ఖాట్మండు సమీపంలో దర్శనమిస్తుంది. ఇక్కడి 'గండకీ నదీ' తీరంలో స్వామివారు సాలగ్రామ శిలగా ... సాలగ్రామమూర్తిగా కొలువై వుండటం విశేషం. ఇక్కడి గండకీ నదిలోనే వివిధ రకాల సాలగ్రామాలు లభిస్తూ వుంటాయి. వివిధ ఆలయాల్లో పూజాభిషేకాలు అందుకుంటోన్న సాలగ్రామాలు ఇక్కడ లభించినవే.
ఈ నదిలో సేకరించిన సాలగ్రామాలతోనే అనేక పుణ్యక్షేత్రల్లోని ధృవమూర్తులను రూపొందించడం జరిగింది. సాలగ్రామమూర్తి అత్యంత అరుదైనదిగా ... విశిష్టమైనదిగా ... కోరిన వరాలను ప్రసాదించే కల్పవృక్షంగా చెప్పబడుతోంది. అలా సాలగ్రామమూర్తి పేరుతో స్వామివారు ... లక్ష్మీదేవి పేరుతో అమ్మవారు ఇక్కడ నిత్య పూజలను అందుకుంటూ వుంటారు.
స్వయంభువుగా ఆవిర్భవించిన ఇక్కడి స్వామివారిని ఎంతోమంది మహర్షులు సేవించారు ... మరెంతో మంది భక్తులు కీర్తించారు. తన మనసు గెలుచుకున్న భక్తులకు స్వామివారు దర్శనమిచ్చిన సందర్భాలు కూడా ఎన్నో వున్నాయి. ఎన్ని కష్టాల్లో వున్నా ... ఎంతటి బాధల్లో వున్నా ఇక్కడి స్వామిని దర్శించి ... వేడుకుంటే చాలట. ఆ కష్టాలను .. దుఃఖాలను స్వామివారి అనుగ్రహం దహించి వేస్తుందని చెబుతుంటారు.