భగవంతుడు లేని చోటు ఉంటుందా ?
శ్రీకృష్ణదేవరాయలవారు పరిపాలనా సంబంధమైన ఇబ్బందులను ఎదుర్కుంటోన్న సమయంలో, ఆధ్యాత్మికపరంగా ఆయనకి తన సహాయ సహకారాలను వ్యాసతీర్థులవారు అందించారు. అందువలన ఆయనను వ్యాసరాయలు అని కూడా పిలుస్తుంటారు. అలాంటి వ్యాసరాయల వారి ఆశ్రమంలో 'కనకదాసు' చోటు సంపాదిస్తాడు. తన వినయ విధేయతలతో వ్యాసతీర్థుల వారి అభిమానాన్ని చూరగొంటాడు.
ఆయనలా వ్యాసతీర్థుల వారికి దగ్గర కావడాన్ని మిగతా శిష్యులు సహించలేకపోతారు. అలాంటి పరిస్థితుల్లోనే వ్యాసతీర్థులవారి ఆశ్రమానికి ఆయన సన్నిహితుడు వస్తాడు. కనకదాసు విషయంలో తమకి గల అసంతృప్తిని మిగతా శిష్యులు ఆయన దృష్టికి తీసుకువస్తారు. కనకదాసు కులమతాలను ప్రస్తావిస్తూ అసహనాన్ని ప్రదర్శిస్తారు. దాంతో ఆయన వ్యాసతీర్థుల వారి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావిస్తాడు.
కనకదాసు పట్ల తనకి గల అభిమానానికి కారణం ఆయనకి గల జ్ఞాన సంపదేనని వ్యాసతీర్థులు చెబుతాడు. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోమంటూ ఆయన కనకదాసుతో పాటు మిగతా శిష్యులందరినీ పిలుస్తాడు. తలా ఒక పండు ఇచ్చి, ఎవరూ లేని ప్రదేశానికి వెళ్లి ఎవరి కంటా పడకుండా ఆ పండును తినిరమ్మని చెబుతాడు. అలా ఆ పండును తీసుకుని వెళ్లిన శిష్యులు చాలా తక్కువ సమయంలో తిరిగొచ్చి, ఆ పండును తినేసినట్టుగా చెబుతారు.
కొన్ని రోజుల తరువాత అందరికంటే చివరిగా ఆశ్రమానికి చేరుకుంటాడు కనకదాసు. భగవంతుడు అంతటా ఉన్నాడనీ ... ఆయన చూడకుండా పండు తినడం తనకి సాధ్యం కాలేదని ఆ పండును గురువుముందు వుంచుతాడు. దాంతో వ్యాసతీర్థుల వారి సన్నిహితుడికే కాదు, అక్కడున్న శిష్యులందరికీ కూడా కనకదాసు గొప్పతనం అర్థమవుతుంది. వాళ్లలో మంచి మార్పురావడానికి ఈ సంఘటన దోహదపడుతుంది.