అరుదైన ఆలయంలో అటుకులే నిత్య నైవేద్యం
మారుమూల గ్రామంలోని ఆలయాల నుంచి మహా పుణ్యక్షేత్రాల వరకూ, ఆయా దైవాలకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తూ వుంటాయి. ఈ నేపథ్యంలో పులిహోర ... దధ్యోదనం ... చక్రపొంగలి వంటి ప్రసాదాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక భక్తులు సమర్పించే వివిధ రకాల పండ్లను కూడా దైవానికి సమర్పిస్తుంటారు. ఈ రెండూ కాకుండా మూలమూర్తికి అటుకులు మాత్రమే నివేదన చేసే క్షేత్రం ఒకటి మనకి గుజరాత్ లోని 'పోరుబందర్'లో దర్శనమిస్తుంది.
శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడైన 'సుధాముడు'(కుచేలుడు)ఈ ఆలయంలో పూజలు అందుకుంటూ వుంటాడు. సాధారణంగా భగవంతుడికీ ... ఆయన మనసు గెలుచుకున్న మహాభక్తులకు ఆలయాలు నిర్మించడం జరుగుతూ వుంటుంది. అలాంటిది భగవంతుడి స్నేహితుడికి ఆలయం నిర్మించి పూజించడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతగా కనిపిస్తుంది. శ్రీకృష్ణుడికీ ... సుధాముడికి ఈ ప్రదేశంతో విడదీయరాని అనుబంధం వుంది.
సాందీపని మహర్షి గురుకులంలో శ్రీకృష్ణుడు ... సుధాముడు కలిసి విద్యను అభ్యసించారు. ఆ సమయంలో వీళ్లిద్దరూ ఒకరిని విడచి మరొకరు వుండేవాళ్లు కాదు. ఆ సమయంలోనే వీళ్లిద్దరూ తమ ఆటపాటలతో ఈ ప్రదేశాన్ని పవిత్రం చేశారు. ఆ కారణంగానే ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. చాలాకాలం క్రితమే నిర్మించిన ఈ ఆలయంలో సుధాముడు ... ఆయన భార్యతో పాటు శ్రీకృష్ణుడు కూడా దర్శనమిస్తూ వుంటాడు.
సుధాముడు బాల్యంలో తన దగ్గరున్న అటుకులను శ్రీకృష్ణుడికి పెట్టలేకపోతాడు. కాలక్రమంలో పేదరికాన్ని అనుభవిస్తూ, శ్రీకృష్ణుడి కోసం అటుకులు తీసుకు వెళతాడు. ఆ అటుకులను స్వీకరిచిన శ్రీకృష్ణుడు, సుధాముడిని శ్రీమంతుడిని చేస్తాడు. భక్తుడు గోరంత సేవచేస్తే భగవంతుడు కొండంత సాయం చేస్తాడనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తుంటుంది.
శ్రీకృష్ణ సుధాముల అనుబంధానికి గుర్తుగా ఈ ఆలయంలో అటుకులనే నైవేద్యంగా పెడుతుంటారు. ఈ అటుకుల ప్రసాదాన్ని భక్తులు అపురూపంగా భావిస్తుంటారు. ఇక్కడి ఆలయాన్ని దర్శించడం వలన పాడిపంటలు వృద్ధి చెందుతాయనీ, సిరిసంపదలు కలుగుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.