భక్తుడి ఆనందమే భగవంతుడికి సంతోషం
దేవుడు ఒక్కడే అయినా ఆయనని అనేక రూపాలలో ఊహించుకుంటూ ... వివిధ నామాలతో ముచ్చటగా పిలుచుకుంటూ ఎంతోమంది భక్తులు తరించారు. నవవిధ భక్తి మార్గాలలో ఎవరికి తోచిన మార్గాన్ని వాళ్లు ఎంచుకుని, ఆ పరమాత్ముడి హృదయంలో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా ఆ కృష్ణ పరమాత్ముడిని తన రచనలతో కీర్తిస్తూ ... ఆలపిస్తూ తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న మహాభక్తుడుగా 'జయదేవుడు'కనిపిస్తాడు.
కృష్ణ భగవానుడిపట్ల తనకు గల ఇష్టాన్ని ఆయన 'గీతాగోవిందం' అనే రచన ద్వారా ఆవిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. జయదేవుడు నిరంతరం ఆ స్వామి ఆలోచనలో వుంటూనే తన రచన కొనసాగిస్తూ వుంటాడు. గంగాప్రవాహంలా సాగిపోతున్న ఆయన రచన ఒకచోట హఠాత్తుగా ఆగిపోతుంది. ఆ శ్లోకంలో ఏ పద సముదాయాన్ని వాడదామన్నా ఔచిత్య భంగం కలుగుతుందని ఆయన భావిస్తాడు. సరైన పదాలతో ఆ శ్లోకాన్ని ఎలా పూర్తి చేయాలనే విషయాన్ని గురించి ఆలోచిస్తూ, అక్కడికి దగ్గరలో గల ఉద్యానవనంలోకి వెళతాడు.
అలా కొంతసేపు అక్కడ పచార్లు చేసిన ఆయన, ఆ శ్లోకాన్ని పూర్తి చేసే ఆలోచన రావడంతో ఇంటికి తిరిగివస్తాడు. కానీ అప్పటికే ఆ శ్లోకం పూర్తి చేసి వుండటం చూసి ఆశ్చర్యపోతాడు. భార్యను పిలిచి ఆ విషయాన్ని గురించి అడగగా, అంతకుముందు ఆయనే ఆ శ్లోకాన్ని రాస్తుండగా తాను చూశానని చెబుతుంది. దాంతో ఆ పరమాత్ముడే తన రూపంలో వచ్చి ఆ శ్లోకాన్ని పూర్తిచేశాడనే విషయం జయదేవుడికి అర్థమైపోతుంది. ఆనందంతో పొంగిపోతూ ఆయన ఆ భగవంతుడి పాదాలచెంత వాలిపోతాడు.