ఇక్కడ నాగప్రతిష్ఠ సంతానాన్ని ఇస్తుందట !
కొత్తగా వివాహమైన వాళ్లు ... సంతానం ఆలస్యమవుతున్నా కొద్ది ఆందోళన చెందుతుంటారు. మొదట్లో వాళ్లకి కాస్త ధైర్యం చెప్పిన పెద్దలు, ఆ తరువాత వాళ్లకన్నా ఎక్కువగా ఆదుర్దా పడుతుంటారు. ఆ దంపతులకు ఆరోగ్యపరమైన పరీక్షలు చేయించడమే కాకుండా, ఏ దోషం వారి సంతాన యోగానికి అడ్డుపడుతుందో తెలుసుకుని దానిని నివారించే ప్రయత్నాలు మొదలుపెడతారు. సంతన భాగ్యం కోసం వివిధ క్షేత్రాలను దర్శించడం ... అనేక రకాల మొక్కులను మొక్కుకోవడం చేస్తుంటారు.
ఇలా సంతానలేమితో బాధపడుతోన్న వాళ్లకి, ఒక క్షేత్రం ఆశాకిరణమై ఆహ్వానం పలుకుతుంటుంది. అదే 'తిరుప్పుళ్ళాణి' క్షేత్రం ... ఇది తమిళనాడు ప్రాంతంలో విలసిల్లుతోంది. ఇక్కడే శ్రీరామచంద్రుడు దర్భలపై శయనించిన కారణంగా ఈ క్షేత్రం 'దర్భశయనం' గా పిలవబడుతోంది. ఇక్కడ స్వామివారు కళ్యాణ జగన్నాథుడు .... అమ్మవారు కళ్యాణవల్లి పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు. సంతానాన్ని కోరుకునే భక్తులు ఈ క్షేత్రానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
ఈ క్షేత్రంలోని రావి చెట్టుకింద 'నాగ ప్రతిష్ఠ' చేయడం వలన, అనతికాలంలోనే సంతాన భాగ్యం కలుగుతుందని విశ్వసిస్తుంటారు. ఈ ప్రాంగణంలో గల నాగ ప్రతిమలను చూస్తే, ఈ విశ్వాసం ఎంతకాలంగా ... ఎంత బలంగా ఉందనే విషయం అర్థమవుతుంది. సంతానం కోసం ఇక్కడ పెద్ద సంఖ్యలో నాగప్రతిష్ఠలు జరుగుతూ వుండగా, ఈ క్షేత్ర మహాత్మ్యం కారణంగా సంతానం పొందిన వాళ్లు, మొక్కులు చెల్లించుకుంటూ కనిపిస్తారు. వీళ్ల సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ వుండటం వల్లనే, ఈ విశ్వాసం మరింతగా బలపడటానికి కారణమనే విషయం స్పష్టమవుతుంది.