భక్తుల బాధలను స్వీకరించే బాబా
దేవతలకు ... సాధు సత్పురుషులకు ... రాజులకు జ్ఞాన - యోగ మార్గాలను గురించి దత్తాత్రేయుడు ఉపదేశించాడు. ఆ స్వామి అవతారంగా శ్రీ శిరిడీసాయిబాబా చెప్పబడుతున్నాడు. తన నుంచి భక్తులు కోరుకునే ప్రేమానురాగాలను విరివిగాపంచే బాబా, తన అనుగ్రహాన్ని పొందాలంటే శ్రద్ధ - సహనం వుండాలని చెప్పాడు.
సాధారణంగా ఏదైనా ఒక కష్టం వచ్చిందని ఎవరి దగ్గరికైనా వెళితే, ఆ కష్టం తీర్చడానికి తమవంతు సాయం చేస్తారు. కానీ ఆ కష్టాన్ని తాము స్వీకరించి, అవతలివారిని బాధల నుంచి విముక్తి చేసే వాళ్లు మాత్రం ఎక్కడా కనిపించరు. అలాంటి పనిని బాబా మాత్రమే చేశాడు కనుక, ఈ రోజున ఆయన ఆలయాలు అశేష భక్త జన సందోహంతో కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. అలాంటి ఆలయాలలో ఒకటి విశాఖపట్నం - కూర్మన్నపాలెంలో దర్శనమిస్తూ వుంటుంది.
భక్తుల సంకల్పంతో రూపుదిద్దుకున్న ఈ ఆలయం,అసమానమైన వారి భక్తికి అద్దంపడుతూ వుంటుంది. మల్లెపందిరిని తలపించేలా నిర్మించబడిన మంటపంలో బాబా, పౌర్ణమినాటి చంద్రుడిలా కనిపిస్తూ వుంటాడు. ఆయనని చూడగానే ఆవేదన మాయమై ఆ స్థానంలో ఆనందం చోటుచేసుకుంటూ వుంటుంది. ఇక్కడి సాయి మహిమలు భక్తుల అనుభవాలుగా వినిపిస్తూ వుంటాయి.
బాబాను మనస్పూర్తిగా ఆరాధిస్తే, బాధలను ... కష్టాలను కర్పూరంలా కరిగిపోయేలా చేస్తాడని స్థానికులు చెబుతుంటారు. మనోహరంగా దర్శనమిస్తూ మనసుకి శాంతిని చేకూర్చే ఈ ఆలయంలో, అభిషేకాలు ... అలంకారాలు ... సేవలు అన్నీకూడా అంకిత భావంతో జరుగుతుంటాయి. బాబా పట్ల భక్తులకు గల విశ్వాసాన్ని చాటుతుంటాయి.