మహిమగల మర్రిచెట్టుని ఇక్కడ చూడొచ్చు
చెట్టే కదా ... కొట్టేస్తేపోలా ! అని కొంతమంది అనుకుంటూ వుంటారు. తనని కొట్టేవారిని చెట్లు అడ్డుకోలేకపోవచ్చు కానీ శపించగలవు. ఇంటి ఆవరణలోగల చెట్టును కొట్టేసి ఆ తరువాత దేనిలోనూ కల్సిరాక వీధినపడిన కుటుంబాలు ఎన్నో వున్నాయి. ఆలయ ప్రాంగణంలో గల చెట్లను ... అధికారం ఉందికదా అని కొట్టేయించి, ఆ తరువాత నానాఇబ్బందులు పడ్డవాళ్లు ఎంతోమంది వున్నారు.
తమకి అడ్డు వస్తున్నాయని చెట్లను కొట్టేవాళ్లే కాదు, ఇతరులకు ఉపయోగపడకూడదని కూడా చెట్లను కొట్టేవాళ్లు ఉన్నారు. చెట్లు పెంచడానికి ఆలోచించవలసిన అవసరం లేకపోయినా, చెట్లను కొట్టడానికి మాత్రం తప్పనిసరిగా ఆలోచించుకోవాలి. ఉజ్జయినీలో గల ఒక మర్రిచెట్టును చూసినప్పుడు ఈ విషయంలో మరింత స్పష్టత వస్తుంది.
ఇక్కడి శిప్రానదీ తీరంలో ఒక మర్రిచెట్టు వుంది. ఈ చెట్టుకింద కూర్చునే పార్వతీదేవి పరమశివుడిని గురించి తపస్సు చేసిందట. ఆ రకంగా ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఈ మర్రిచెట్టును భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకోవడం మొదలుపెట్టారు. మతపరంగా అది సహించలేని కొందరు ఈ మర్రిచెట్టును కొట్టేశారు. తిరిగి అది పెరగకుండా చేయవలసినదంతా చేశారు.
తనకి నీడనిచ్చిన చెట్టు నిలువునా కూలిపోతే జగజ్జనని చూస్తూ కూర్చుంటుందా ? ఆ తల్లి అనుగ్రహంతో అక్కడది మరింత బలంగా పెరగడం మొదలుపెట్టింది. ఈ సారి దానిని నాశనం చేయడానికి ప్రయత్నించిన వాళ్లంతా తగిన శిక్షను అనుభవించారు. ఆనాటి నుంచి దీనిని మహిమగల మర్రిచెట్టుగా విశ్వసిస్తూ వుంటారు. అమ్మవారు ఇప్పటికీ ఈ చెట్టు నీడలోనే నివసిస్తోందని భావిస్తుంటారు. ఈ కారణంగా ఇప్పుడా చెట్టును చూడటానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరగడం విశేషం.