భక్తుడి మాట భగవంతుడు ఎప్పుడూ వింటాడు
అంబరీషుడికి రాజ్యాధికారం దక్కకుండా చేయడానికిగాను ఆయన సోదరుడు కుట్రపన్నుతాడు. పథకం ప్రకారం అంబరీషుడిని ... ఆయన భార్యను రాజ్యం నుంచి వెళ్లగొడతాడు. జరిగినదానికి అంబరీషుడు ఎంతమాత్రం బాదపడడు. ప్రశాంతంగా ... ఏకాంతంగా విష్ణునామ సంకీర్తనం చేసుకునే భాగ్యం కలిగిందని అనుకుంటాడు. దంపతులిద్దరూ అడవిలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకుని, శ్రీహరి నామస్మరణచేస్తూ కాలం గడపసాగారు.
అంబరీషుడి అడ్డుతొలగిపోయిందనే సంతోషంతో ఆయన సోదరుడు రాజ్యాధికారాన్ని చేపడతాడు. అయితే అంబరీషుడు రాజ్యాన్ని వీడినది మొదలు బావులు ... చెరువులు ... నదులలోని నీరు ఇంకిపోవడం మొదలవుతుంది. వర్షాలు పడకపోవడంతో పంటలు పండక కరవుకాటకాలు ఏర్పడతాయి. ఆకలిబాధను తట్టుకోలేక చనిపోయే మనుషుల సంఖ్య ... పశువుల సంఖ్య పెరిగిపోతూ వుంటుంది.
అంబరీషుడు వంటి పుణ్యాత్ముడు రాజ్యం వదలిపోవడం వల్లనే తమకి కష్టకాలం వచ్చిందని ప్రజలు గ్రహిస్తారు. అడవంతా గాలిస్తూ అంబరీషుడి ఆశ్రమానికి చేరుకుంటారు. వర్షాలు లేక .. పంటలు లేక తాము పడుతోన్న ఆకలిబాధను అంబరీషుడికి వివరిస్తారు. కరవుకాటకాల బారి నుంచి తమని కాపాడమంటూ ప్రాధేయపడతారు. తన బిడ్డలవంటి ప్రజలు అన్నపానియాలు లేక అవస్థలు పడుతున్నారని తెలిసి అంబరీషుడు తల్లడిల్లిపోతాడు.
తక్షణమే వానలు కురిపించి, కరవుకాటకాలు పారద్రోలమని ఆ శ్రీమహావిష్ణువును కోరతాడు. ఆ క్షణమే ఆకాశం మేఘావృతమై వానధారలు నేలను తాకుతాయి. ప్రజలంతా కూడా ఆనందంతో పొంగిపోతూ ఆ వర్షంలో తడుస్తారు. అంబరీషుడి పాదాలపైపడి కృతజ్ఞతలు తెలుపుతారు.