మనసును మంత్రించే క్షేత్రం
కృష్ణా ... అనే రెండు అక్షరాలను స్మరించినంత మాత్రాన్నే కష్టాలన్నీ మాయమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఒకవైపున మంచితనానికి ప్రతీకలుగా కనిపించే ప్రజలందరికి తన ఆటపాటలతో వినోదాన్ని అందిస్తూ, వాళ్లెవరూ భయపడకుండా నింపాదిగా దుష్టులందరినీ సంహరిస్తూ వెళ్లిన తెలివితేటలు మనకి శ్రీకృష్ణుడిలోనే కనిపిస్తాయి. మన్నులో ఆడుకునే వయసు నుంచి మహాభారత యుద్ధం వరకూ ఆయన ఏంచేసినా అందులో లోక కళ్యాణ కారకమైనది దాగివుంటుంది.
అలాంటి కృష్ణుడు అనేక ప్రాంతాల్లో స్వయంభువుగా ఆవిర్భవించి భక్తులచే నిత్యపూజలు అందుకుంటున్నాడు. ఈ జాబితాలో మనకి కనిపించే కృష్ణాలయం 'బల్లిపాడు'లో దర్శనమిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రంలో స్వామివారు రుక్మిణీ - సత్యభామ సమేతుడై 'మదనగోపాలుడు'గా పూజలందుకుంటూ ఉంటాడు. ప్రశాంతత ... ఆహ్లాదం ఈ క్షేత్రానికి సహజమైన అలంకారాలుగా అనిపిస్తూ వుంటాయి.
గర్భాలయంలో స్వామివారు ఓ మాదిరి పరిమాణంలో వేణువు వాయించే భంగిమలో దర్శనమిస్తూ ఉంటాడు. ఎంతోమంది రాజులు స్వామివారిని ఆరాధించినట్టుగా ఇక్కడి చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన ... ప్రధానమైన ఆకర్షణ పుష్కరిణి అని చెప్పవచ్చు. ఆలయానికి ఎదురుగా సువిశాలంగా కనిపించే ఈ పుష్కరిణి ఎప్పుడు చూసినా స్వచ్చమైన జలాలతో నిండుగా కళకళలాడుతూ కనిపిస్తుంది. ఈ పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని దర్శించడం వలన, కోరిన కోరికలు నెరవేరతాయని స్థానికులు చెబుతుంటారు.
ఈ పరిసరప్రాంతాల్లో పాడిపంటలకు లోటురాకపోవడానికి కారణం ఈ స్వామియేనని విశ్వసిస్తుంటారు. విశేషమైన తిథుల్లో స్వామివారికి ప్రత్యేకపూజలు ... ఘనమైన సేవలు జరుపుతుంటారు. ఈ సందర్భంగా ఆయన భక్తులు ఉత్సాహంగా ఈ క్షేత్రానికి తరలివస్తుంటారు ... ఉత్సవాల్లో పాల్గొని ఆ స్వామి అనుగ్రహాన్ని అందుకుంటూ వుంటారు.