హనుమంతుడు అలా విరుచుకుపడ్డాడట !
హనుమంతుడు ఎంతో బలశాలి ... అంతకుమించిన బుద్ధిశాలి. ఎక్కడ బాహుబలాన్ని ఉపయోగించాలో ... ఎక్కడ బుద్ధిబలాన్ని ప్రదర్శించాలో ఆయనకి బాగాతెలుసు. అందుకే సీతాన్వేషణ సమయంలో రాముడు ఆయనకి ఎక్కువ ప్రాధాన్యతను ... స్వేచ్ఛను ఇచ్చాడు. అలాంటి హనుమంతుడు రామనామం స్మరించేచోట చిన్నపిల్లవాడిలా ఆడతాడు. రాముడిని గానీ .. రామాయణమునుగాని .. తనని గాని నిందించినవారిని నిర్దయతో దండిస్తాడు.
కాళిదాసు కాలంలో ఆయన కనులముందు జరిగిన సంఘటనే ఇందుకు ప్రత్యక్ష్య నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కాళిదాసు ప్రతిభాపాటవాలను గురించి తెలుసుకున్న భోజరాజు ఒకసారి ఆయనని తన ఆస్థానానికి ఆహ్వానిస్తాడు. ఆ సమయంలోనే సందర్భాన్ని బట్టి ఆయన భోజరాజుకి ఒక శ్లోకం వినిపిస్తాడు. ఆ శ్లోకం తన మనసు దోచుకుందనీ ... దానిని ఎవరు రాశారని అడుగుతాడు భోజరాజు. అది 'హనుమద్రామాయణం'లోనిదనీ ... హనుమంతుడే రాశాడని చెబుతాడు కాళిదాసు.
ఆయన రాకని ఏమాత్రం ఇష్టపడని కొందరు పండితులు పకపకా నవ్వుతారు. రాజుగారిని కాళిదాసు తప్పుదోవ పట్టిస్తున్నాడనీ ... రామాయణాన్ని కోతి రాయడమేమిటని ఎగతాళి చేస్తారు. కాళిదాసుపట్ల వారికి గల అసూయ కారణంగా వ్యవహారం మరింత సృతి మించుతుంది. అదే సమయంలో ఓ భారీఆకారం ఆ సభామందిరంలోకి ప్రవేశిస్తుంది. వచ్చినది హనుమంతుడని తెలిసి అందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. కాళిదాసు ... భోజరాజు ఆయనకి నమస్కరిస్తూ అలాగే ఉండిపోతారు.
హనుమంతుడి గురించి తప్పుగా మాట్లాడిన పండితులు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ హనుమంతుడి 'గద'బారి నుంచి తప్పించుకోలేకపోతారు. అజ్ఞానంతో తప్పుచేసిన తమను క్షమించమని ఆ స్వామి పాదాలపై పడతారు. ఇకమీదట ఎప్పుడూ ఎవరినీ ఎగతాళి చేయమని చెప్పడంతో వాళ్లని వదిలేసి హనుమంతుడు వెళ్లిపోతాడు.