ఇది సాక్షాత్తు శివుడి ఆత్మలింగమేనట !
పురాణాలను పరిశీలిస్తే పరమశివుడి ఆత్మలింగాన్ని పొందిన భక్తులు కొందరు కనిపిస్తారు. అసమానమైన వారి భక్తికి మెచ్చి సదాశివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించినప్పటికీ, అది ఎవరి దగ్గర వుంటే లోకకళ్యాణ కారకమవుతుందో వారి దగ్గర మాత్రమే ఉండేలా విష్ణుమూర్తి జాగ్రత్తలు తీసుకున్నాడు. అలా ఆదిదేవుడి ఆత్మలింగాన్ని గ్రహించి, సాధారణ భక్తులకు సైతం దాని దర్శనభాగ్యాన్ని కల్పించిన ఘనత కపిలమహర్షికి దక్కుతుంది.
ఆయన ప్రతిష్ఠించిన ఆత్మలింగం విశాఖలోని 'అప్పికొండ'లో దర్శనమిస్తుంది. పూర్వం ఈ ప్రదేశంలో ఒకే రోజున నూటొక్క శివలింగాలను ప్రతిష్ఠించాలని కపిలమహర్షి నిర్ణయించుకున్నాడట! సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోగా అన్ని శివలింగాలను ప్రతిష్ఠించవలసి వుంటుంది. అనుకున్న ప్రకారం కపిలమహర్షి చకచకా ఆ పని చేసుకుంటూ వెళ్లసాగాడు. సూర్యాస్తమయం దగ్గరపడుతోండగా ఇంకా ఒక శివలింగాన్ని మాత్రమే స్థాపించవలసి వుంది.
అందుకు సమయం లేకపోవడంతో ఆయన శివుడిని ప్రార్ధిస్తాడు. వెంటనే శంకరుడు ప్రత్యక్షమై ఆయనకి తన ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు. స్వామికి కృతజ్ఞతలు తెలిపిన కపిలుడు ఆ శివలింగాన్ని వెంటనే ప్రతిష్ఠిస్తాడు. ప్రస్తుతం ఈ క్షేత్రంలో గర్భాలయంలో కొలువై భక్తులకు దర్శనమిస్తోన్న శివలింగం అదే. కపిలుడు నూటొక్క శివలింగాలను ప్రతిష్ఠించగా, కాలక్రమంలో 96 శివలింగాలు భూగర్భంలో కలిసిపోయాయని చెబుతుంటారు.
ప్రస్తుతం గర్భాలయంలోని ఆత్మలింగం కాకుండా మరో నాలుగు శివలింగాలు మాత్రమే పైకి కనిపిస్తూ పూజాభిషేకాలు అందుకుంటూవుంటాయి. గర్భాలయంలోని శివలింగం సాక్షాత్తు సదాశివుడి ఆత్మలింగమని చెబుతోన్న కారణంగా, ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా అలరారుతూ, భక్తుల హృదయాలను భారీగా గెలుచుకుంటోంది.