ఇక్కడ దేవుడు ప్రత్యక్షంగా ఉన్నాడట !
ఒకానొక సమయంలో హిందూ దేవాలయాలపై మతపరమైన దాడులు తీవ్రంగా జరిగాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఆలయాలు పూర్తిగా దెబ్బతింటే, మరికొన్ని ఆలయాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మహారాజులు ... చక్రవర్తులు దగ్గరుండి మరీ ఆలయాల్లో చెక్కించిన అపురూపమైన శిల్పాలు భిన్నమైపోయాయి. మహర్షులచే పూజాభిషేకాలు అందుకున్న ఎన్నో ధృవమూర్తులు కూడా ఈ దాడులకు గురయ్యాయి.
కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు జరగనున్న దాడులను ముందుగానే గ్రహించి, గర్భాలయాల్లోని దైవమూర్తులను రహస్యంగా మరోచోటికి తరలించి, తమ దైవాన్ని తాము కాపాడుకున్నందుకు సంతోషంతో పొంగిపోయారు. అలాంటి సంఘటన ఒకటి మనకి మచిలీపట్నం ప్రాంతంలో కనిపిస్తుంది. మచిలీపట్నం సమీపంలోని ఒక గ్రామంలో 16 వ శతాబ్దం పూర్వం నుంచి వేంకటేశ్వరస్వామి పూజలు అందుకుంటూ ఉండేవాడు.
ఈ స్వామిని ప్రజలు ఎంతో సుకుమారంగా చూసుకుంటూ ఉండేవాళ్లు. దాడులలో తమ స్వామికి ఏంజరిగినా ఇక తాము బతికివుండటం వృధా అనీ, ఆయన్ని రక్షించుకునే క్రమంలో ప్రాణాలు పోయినా ఫరవాలేదని నిర్ణయించుకుంటారు. స్వామివారి మూలమూర్తిని మెత్తని వస్త్రంలో చుట్టి ఎడ్లబండికి గూడు ఏర్పాటుచేసి అందులో ఆయన్ని ఊరుదాటించేందుకు సిద్ధపడతారు.
ఈ సమాచారాన్ని అందుకున్న మతేతరులు పొలిమేరలో కాపలాకాస్తారు. స్వామివారు వున్న ఎడ్లబండిని ఆపి లోపల వున్నది ఎవరని అడుగుతారు. బండితోపాటు నడుస్తోన్న భక్తులు, తమ బంధువుకి అనారోగ్యంగా ఉందనీ ... వైద్యం నిమిత్తం వెళుతున్నామని అబద్ధం చెబుతారు. వాళ్లు సోదాచేయబోగా ... అనారోగ్యంతో బాధపడుతున్నవాడిలా వేంకటేశ్వర స్వామి మూలగడం మొదలుపెడతాడు.
దాంతో వాళ్లు లోపల వున్నది మనిషే కానీ ... విగ్రహం కాదనుకుని వదిలేస్తారు. స్వామివారి మూలుగు విన్న భక్తులు మాత్రం సంతోషంతో పొంగిపోతారు. అలా అతికష్టం మీద మచిలీపట్నానికి చేరుకున్న వాళ్లు అక్కడ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తారు. ఈ కారణంగా ఇక్కడ స్వామి ప్రత్యక్షంగా ఉన్నాడని భక్తులు విశ్వసిస్తుంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనని పూజిస్తూ పునీతులవుతుంటారు.