ఏదైనా నందీశ్వరుడి చెవిలో చెప్పాల్సిందే !
సాధారణంగా ఏదైనా పుణ్యక్షేత్రాలకి వెళ్లినప్పుడుగానీ, ఇతర ప్రాంతాల్లో వెలుగొందుతోన్న ఆలయాలకి వెళ్లినప్పుడు గాని గర్భాలయానికి ఎదురుగా గల స్వామివారి సేవకుడికి ముందుగా నమస్కరించడం జరుగుతుంది. ఆ తరువాత ప్రధాన దైవాన్ని దర్శించి మనసులోని కోరికను ఆయనకి మనవి చేయడం జరుగుతుంటుంది. అలా కాకుండా స్వామివారి సేవకుడికే కోరికలు చెప్పుకునే పద్ధతి మనకి ఒక ఆలయంలో కనిపిస్తుంది.
ప్రత్యేకమైన పద్ధతిని కలిగి వున్న ఆ ఆలయమే ... రుద్రేశ్వరాలయం. మెదక్ జిల్లా 'కొండపాక'లో ప్రాచీనకాలంగా ఈ ఆలయం విలసిల్లుతూ వస్తోంది. సాధారణంగా రాముడు ... వేంకటేశ్వరుడు వంటి దేవుళ్లకు మనసులోని కోరికలను చెప్పుకునే భక్తులు, స్వామివారికి పదే పదే ఆ విషయాన్ని గుర్తుచేస్తూ తమపని జరిగేలా చూడమని అమ్మవారిని ప్రాధేయపడుతూ వుంటారు.
అలాగే రుద్రేశ్వరుడికి తమ మొరను వినిపించే బాధ్యతను ఆయన ప్రధమ భక్తుడు ... ప్రధాన సేవకుడు అయిన నందీశ్వరుడి భుజాలపై పెడుతుంటారు. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు .. స్వామివారికి ఎదురుగా వున్న నందీశ్వరుడి దగ్గరికి వచ్చి, ఆయనకి మాత్రమే వినిపించేలా తమ కోరికలను చెప్పుకుంటారు. చూడటానికి ఈ దృశ్యం చిత్రంగానే కాదు, ముచ్చటగా కూడా అనిపిస్తూ వుంటుంది.
లయకార్యంలో శివుడు నిరంతరం సతమతమై పోతుంటాడు. ఆయనకి ఏ మాత్రం కాస్త తీరికగా దొరికినా, తమ మనవిని తెలియజేయమని భక్తులు నందీశ్వరుడికి తమ మొరను వినిపిస్తుంటారు. ఈ విధంగా నందీశ్వరుడి చెవిలో చెప్పబడిన కోరికలు అనతికాలంలోనే నెరవేరతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. తమ కోరికలను నెరవేర్చడంలో ప్రధానమైన భూమికను పోషిస్తోన్న నందీశ్వరుడిని శివయ్యతో సమానంగా పూజిస్తుంటారు.