విద్యలో రాణింపజేసే నారద మహర్షి
నారదుడు అనే పేరు వినగానే మెడలోను ... జబ్బలకి ... ముంజేతులకి పూలమాలికలు ... రుద్రాక్షలు ధరించి, చిడతలు ... వీణ చేత బట్టిన సుందరమైన రూపం కనులముందు కదలాడుతుంది. హాయిగా హరినామస్మరణం చేస్తూ ముల్లోకాలలో ఆయన సంచరిస్తోన్న దృశ్యం మనోహరంగా గోచరిస్తుంది. ఎవరెటుపోతే తనకేమిటి అన్నట్టుగా నారదుడు ఎప్పుడూ వ్యవహరించలేదు. ముల్లోకాలలో ఎక్కడ ఏమూల ఏంజరుగుతుందో తెలుసుకుని, దానిని ఏ పరిష్కారదిశగా నడిపిస్తే బావుంటుందోననే విషయాన్ని ఆయన ముందుగానే ఆలోచించి పెట్టుకునేవాడు.
లోకం క్షేమంగా వుంటే చాలు ... తన గురించి ఎవరు ఏమనుకుంటేనేమి ? అన్నట్టుగా ఆయన 'కలహభోజనుడు' అనే బిరుదును సైతం సంతోషంగా స్వీకరించాడు. అయితే ఆయన ఎవరి మధ్య ఎలాంటి కలహం రేపినా దానివెనుక లోక కల్యాణం దాగి ఉంటుందనేది అనేకమార్లు రుజువైంది. ఏ కార్యాన్ని ఎక్కడ ఎలాంటి మలుపు తిప్పాలో ... ఆ కార్యాన్ని రసవత్తరంగా నడిపించి ఎలా సుఖవంతంగా ముగించాలనేది నారదుడికి బాగా తెలిసిన విద్య. అందువలన ఆయన అనుకున్న పనిని పూర్తిచేసేంత వరకూ ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలిసేది కాదు.
కృష్ణుడిపై రుక్మిణికి గల ప్రేమ లోకానికి తెలపడంలోను ... అనసూయాదేవి పాతివ్రత్యాన్ని త్రిమాతలు అంగీకరించేలా చేయడంలోను ... అశ్వనీ దేవతల విషయంలో దేవేంద్రుడికి గర్వభంగం కలిగించడంలోను ... ప్రహ్లాదుడి విషయంలో హిరణ్యకశిపుడిని రెచ్చగొట్టి శ్రీహరి చేతిలో ఆయన సంహారం జరిగేలా చేయడంలోను నారదుడు ప్రధానమైన పాత్రను పోషించాడు. చెడును రెచ్చగొడుతూ ... మంచిని ప్రోత్సహిస్తూ, చివరికి చెడుకు గుణపాఠం జరిగేలా ... మంచికి విజయం చేకూరేలా చేశాడు.
శివకేశవులు దుష్ట శిక్షణ ... శిష్ట రక్షణ ప్రత్యక్షంగా చేయగా, అనేక సందర్భాల్లో అందుకు పరోక్షంగా సహకరించినవాడిగా నారదుడు కనిపిస్తాడు. అలా లోక కల్యాణం కోసం తన వంతు పాత్రను పోషించిన నారదుడు, 'వైశాఖ బహుళ విదియ' రోజున జన్మించాడు. ఈ రోజున ఆయనని స్మరించుకోవడం వలన నారదమహర్షి ఆశీస్సులతో పాటు శ్రీమహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుంది. సంగీతజ్ఞానం అలవడటమే కాకుండా, విద్యలో రాణించడం జరుగుతుందని చెప్పబడుతోంది.