ఆ స్వామి ఆగ్రహంలోనే అనుగ్రహం దాగుంది
శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో నరసింహ అవతారం అత్యంత శక్తిమంతమైనదిగా చెప్పబడుతోంది. అవతారకార్యం పూర్తయిన తరువాత ఆయన ఆవిర్భవించిన క్షేత్రాలు కూడా మహాశక్తిమంతమైనవిగా విలసిల్లుతున్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఆయన జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని భక్తులతో సందడిగా కనిపిస్తూ వుంటాయి. వైశాఖ మాసపు శుక్ల పక్షంలో పౌర్ణమి ముందురోజున వచ్చే చతుర్దశి రోజున స్వామివారు అవతరించిన కారణంగా, ఈ రోజున ఆయన జయంతోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వుంటారు.
హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం నరసింహస్వామి అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. అందువలన ఆయనలో ఉగ్రత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ వుంటుంది. అయితే ఆ స్వామి ఆగ్రహానికి వెనుక అనురాగం దాగివుందనేది ఆయన భక్తులకు బాగా తెలుసు. తన భక్తులకు పరీక్షా సమయం ఎదురైనప్పుడు, వారిని కాపాడటానికి తాను ఎక్కడి నుంచి ఏ రూపంలోనైనా రాగలనని స్వామివారు ఈ అవతారం ద్వారా చాటిచెప్పారు.
హిరణ్యకశిపుడు స్తంభాన్ని పగులగొట్టగానే అందులో నుంచి సింహగర్జన చేస్తూ ... ఉగ్రత్వంతో ఊగిపోతూ నరసింహస్వామి బయటికి వచ్చాడు. ఆయనకి అంత ఆగ్రహం రావడానికి కారణం, తన భక్తుడైన ప్రహ్లాదుడుని హిరణ్యకశిపుడు అప్పటివరకూ ఎన్నో పరీక్షలకు గురిచేయడమే. ప్రహ్లాదుడి పట్ల ఆయనకి గల అపారమైన అనురాగమే అంతటి ఆగ్రహాన్ని కలిగించింది. ఇక ప్రహ్లాదుడు చెప్పిన చోటు నుంచి బయటికి వచ్చి తన భక్తులకు తనపై గల విశ్వాసం నిలిచేలా స్వామి వ్యవహరించాడు.
అంతే కాకుండా హిరణ్యకశిపుడిని సంహరించి, ఆయనకి ఆ రాక్షస జన్మ నుంచి విముక్తిని ప్రసాదించాడు. అలా స్వామి తన భక్తుడైన ప్రహ్లాదుడిని ... ఈ జన్మలో తన శత్రువైన హిరణ్యకశిపుడిని సైతం అనుగ్రహించి తన అవతారకార్యంలోని విశిష్టతను ఆవిష్కరించాడు. భక్తులను రక్షించడం కోసం ... ఉద్ధరించడం కోసం నరసింహస్వామి ఆవిర్భవించాడు గనుక, ఆయన అవతరించిన ఈ రోజున స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి.
ఈ రోజున స్వామివారిని పంచామృతాలతో అభిషేకించి, షోడశ ఉపచారాలతో పూజించాలి. ఈ విధంగా స్వామిని సేవించడం వలన దుష్టశక్తుల బారి నుంచి ... గ్రహపీడల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్యాలు తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయని చెప్పబడుతోంది.