ఆశ్చర్యచకితులను చేసే అరుదైన శివలింగం !
ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో క్షేత్ర ఆవిర్భావానికి ఒక్కో నేపథ్యం కనిపిస్తూ ఉంటుంది. ఆయా క్షేత్రల్లోని ఒక్కో శివలింగం ఒక్కో విశిష్టతను సంతరించుకుని సాక్షాత్కరిస్తూ ఉంటుంది. పానవట్టం నుంచి నీరు ఊరుతోన్న శివలింగాలు ... శివలింగం పైభాగాన గల రంధ్రాల నుంచి నీరు ధారగా ప్రవహించే శివలింగాలు ... వివిధ ముద్రలుగల శివలింగాలు ... వర్ణాలు మారే శివలింగాలు ... ఒకే శివలింగాకృతిపై చెక్కబడిన సహస్ర లింగాలు ఈ జాబితాలో మనకి కనిపిస్తూ ఉంటాయి.
అయితే వాటన్నింటి కంటే భిన్నమైన శివలింగం మనకి 'శ్రీక్షేత్ర బనేశ్వర్' లో దర్శనమిస్తుంది. మహారాష్ట్ర - పూణె పరిధిలో ఈ క్షేత్రం అలరారుతోంది. పూర్వం ఈ ప్రాంతం దట్టమైన అడవిలో భాగంగా వుండేది. స్వయంభువుగా వన ప్రదేశంలో ఆవిర్భవించిన ఈ స్వామిని భక్తులు 'వనేశ్వర్'గా కొలిచేవారు. కాలక్రమంలో ఆ పేరు 'బనేశ్వర్'గా మారింది. ప్రాచీన వైభవానికి ప్రతీకగా కనిపించే ఈ ఆలయ ప్రాంగణంలో అడుగుపెడితే, పవిత్రమైన రెండు కుండాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ నీటిని సేవించడం వలన సమస్త పాపాలు పరిహరించబడతాయని స్థలపురాణం చెబుతోంది.
ఎంతోమంది మహర్షులు ... మహారాజులు ఇక్కడి స్వామివారిని సేవించి మోక్షమార్గంలో ప్రయాణించారు. అలాంటివారి జాబితాలో మనకి శివాజీ మహారాజు కూడా కనిపిస్తాడు. శిధిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని ఆయనే పునరుద్ధరించాడని చరిత్ర చెబుతోంది. ఇక ఇక్కడి గర్భాలయంలో శివలింగం ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. పానవట్టం భూగర్భంలో ఉండిపోగా ... లింగ భాగం మాత్రమే పైకి కనిపిస్తూ ఉంటుంది. ఈ శివలింగాన్ని పైకి తీయగా ... భూగర్భం లోపల మరో అయిదు శివలింగాలు దర్శనమిస్తాయి.
ఇంతటి విశిష్టతను పైకి ఎంతమాత్రం తెలియనీయకుండా ఈ శివలింగం సాధారణంగా కనిపిస్తూ వుండటం విశేషం. ఈ చిత్రం ఎంతటివారినైనా ఆశ్చర్యచకితులను చేయకమానదు. అరుదైన ఈ విశేషాన్ని తిలకించడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. పర్వదినాల్లో స్వామివారికి జరిగే ప్రత్యేక ఉత్సవాలు చూసితీరవలసిందే. ఈ స్వామిని దర్శించడం వలన సకలశుభాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అటు పౌరాణిక ప్రాధాన్యతను ... ఇటు చారిత్రక నేపథ్యాన్ని కలిగియున్న ఈ క్షేత్ర దర్శనం జీవితకాలంపాటు చెరిగిపోని మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.