కొత్తపెళ్లి కొడుకుగా దర్శనమిచ్చే వేంకటేశ్వరుడు
సహజంగానే శ్రీ వేంకటేశ్వరస్వామి మహా సౌందర్యవంతుడు. మనోహరమైన ఆయన మూలమూర్తిని చూడగానే మనసు పులకించిపోతుంటుంది. శ్రీనివాసుడు అలంకారప్రియుడు కావడం వలన, వివిధ రకాల పూలమాలికలతోను ... అనేక రకాల ఆభరణాలతోను కనువిందు చేస్తుంటాడు. ఇక పూలమాలికలు ... ఆభరణాలతోపాటు బుగ్గన చుక్క గల వేంకటేశ్వరుడు మనకి 'శ్రీనివాసమంగాపురం'లో దర్శనమిస్తూ ఉంటాడు.
పురాణపరమైన ప్రాశస్త్యం ... చారిత్రక నేపథ్యం గల ఈ క్షేత్రం తిరుపతి సమీపంలో విలసిల్లుతోంది. కొత్త పెళ్లి కొడుకుగా ఆ వైకుంఠనాథుడిని దర్శించి తరించిపోయే మహద్భాగ్యం భక్తులకు ఈ క్షేత్రంలోనే కలుగుతుంది. ఇక కొత్త పెళ్లి కూతురైన అమ్మవారు ఆయన వక్షస్థలంలోనే కొలువై మురిసిపోతుంటుంది. అమ్మవారికి చీరసారెలు పెట్టి, ఇక్కడి నుంచే పుట్టింటి వారు తిరుమలకు సాగనంపినట్టు తెలిసినప్పుడు, ఇక్కడి పవిత్రమైన నేలను మరోమారు కళ్లకు అద్దుకోవాలనిపిస్తుంది.
వేంకటేశ్వరస్వామి ఎంతటి అందగాడు అనే విషయం ఇక్కడి మూలమూర్తిని చూస్తే తెలుస్తుంది. గర్భాలయం నిండుగా నిలువెత్తు రూపంలో కనిపించే ఈ స్వామివారిని విడిచి వెనుదిరగడం కాస్తంత కష్టమైన విషయంగానే అనిపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ క్షేత్రంలో, స్వామివారికి వివిధ సేవలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో విశాలమైన పుష్కరిణి ... స్వామివారిని ఊరేగించే రథం కనిపిస్తుంటాయి. ఇక ఎత్తయిన రాజగోపురం ... పొడవైన ప్రాకారాలు ... ప్రాకార మంటపాలు ఆలయ వైభవాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి.
ఆలయ నిర్మాణం స్వామివారి పట్ల ఆనాటి రాజులకు గల భక్తి శ్రద్ధలకు నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారు అమ్మవారిని వివాహం చేసుకుని తిరుమల కొండకు వెళుతూ ఇక్కడ కొంతకాలం పాటు విడిది చేసినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు ... మహర్షులు ఇక్కడికి వచ్చే ఆయనని సేవించుకోవడం జరిగింది. ఆ తరువాత అమ్మవారిని వెంటబెట్టుకుని తిరుమల కొండపైకి చేరుకున్నాడు.
ఈ కారణంగానే ఆనాటి నుంచి ఈనాటి వరకూ నూతన దంపతులు ముందుగా ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడి వేంకటేశ్వరుడిని ... అలమేలుమంగమ్మను దర్శించి వారి ఆశీర్వాదాన్ని పొందుతుంటారు. ఆ తరువాతనే తిరుమల కొండపైకి చేరుకుంటూ వుంటారు. ఈ విధంగా చేయడం వలన సంతాన సౌభాగ్యాలతో ... సుఖ సంతోషాలతో వైవాహిక జీవితం సాగిపోతుందని విశ్వసిస్తుంటారు.