వెండి శివలింగానికి అభిషేకం చేస్తే ఫలితం ?
భూమండలంలోని అనేక పవిత్రమైన ప్రదేశాల్లో పరమశివుడు లింగరూపంలో ఆవిర్భవించాడు. ఆ దేవదేవుడిని అభిషేకించడం వలన సమస్త పాపాలు తొలగిపోయి, సకలశుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అనునిత్యం శివాలయానికి వెళ్లి అభిషేకించే అవకాశం లేనివాళ్లు, తమ ఇంట్లోని పూజా మందిరంలో శివలింగాన్ని ఏర్పాటుచేసుకుని పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు.
ఒక్కో అభిషేక ద్రవ్యం వలన ఒక్కో ఫలితం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాగే ఒక్కోరకం శివలింగాన్ని అభిషేకించడం వలన ఒక్కోఫలితం దక్కుతుంది. సాధారణంగా బంగారం .. వెండి .. ఇత్తడి .. స్పటిక .. రాయి .. మట్టితో చేయబడిన శివలింగాలను ఎక్కువగా పూజిస్తుంటారు. జ్ఞానం పెంపొందడం కోసం .. వ్యాపార అభివృద్ధి కోసం .. విజయం కోసం .. ఆరోగ్యం కోసం .. ఆయుష్షు కోసం వివిధ రకాల శివలింగాలను పూజించడం జరుగుతుంది.
ఇక ధన ధాన్యాలు పొందాలనుకునే వాళ్లు ఏ శివలింగాన్ని ఆరాధించాలనే సందేహం కొంతమందికి కలుగుతుంటుంది. ధనధాన్యాల వృద్ధిని కోరుకునే వాళ్లు వెండి శివలింగాన్ని అభిషేకించాలని శాస్త్రం చెబుతోంది. ఆర్ధిక పరిస్థితులు ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఆర్ధిక పరమైన చిరాకులు పూజా మందిరం దగ్గర ప్రశాంతంగా కూర్చోనివ్వవు ... భగవంతుడిపై మనసును నిలపనీయవు.
అందువలన ప్రతివారికి ఆర్ధికపరమైన స్థిమితం ఉండటం ఎంతైనా అవసరం. అలాంటి ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగిపోవాలంటే వెండి శివలింగాన్ని అభిషేకించడమే మార్గం. వెండి శివలింగాన్ని ప్రతినిత్యం అభిషేకించడం వలన సదాశివుడి కరుణా కటాక్షాలు లభిస్తాయి ... ధనధాన్యాలు ఇంటికి నడచుకుంటూ వస్తాయి.