పరమశివుడు సృష్టించిన పవిత్ర తీర్థం
పుణ్యక్షేత్రాలకు వెళ్లిన భక్తులు అక్కడ గల పుణ్యతీర్థాలలో స్నానమాచరించి దైవదర్శనం చేసుకుంటూ వుంటారు. దైవ సంకల్పం కారణంగా ... మహర్షుల తపోబలంచేత ఈ పుణ్యతీర్థాలు ఏర్పడుతుంటాయి. ఈ పుణ్యతీర్థాలు ఏర్పడిన సందర్భాన్ని బట్టి ... అవి సృష్టించబడిన పరిస్థితిని బట్టి ఫలితాలను ఇస్తుంటాయి. కొన్ని తీర్థాలలో స్నానం వలన జ్ఞానం ... మరికొన్ని తీర్థాలలో స్నానం చేయడం వలన ఆయురారోగ్యాలు ... సిరిసంపదలు కలుగుతూ ఉంటాయి.
ఇక వీటన్నింటినీ అందించే పుణ్యతీర్థంగా 'త్రిశూలతీర్థం' కనిపిస్తుంది. పరమపవిత్రమైనదిగా ... మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న ఈ తీర్థం, చిత్తూరు జిల్లా 'మొగలి'లో దర్శనమిస్తుంది. మొగలి పువ్వును పరమశివుడు శపించిన విషయం మనకి పురాణాలలో కనిపిస్తుంది. ఆ తరువాత ఆ మొగలి పువ్వును ఆయన అనుగ్రహించినది ఈ ప్రదేశంలోనేనని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఈ కారణంగానే ఈ ఊరుకి 'మొగలి 'అనీ ... ఈస్వామికి 'మొగిలేశ్వరుడు' అనే పేరు వచ్చింది.
ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించిన పరమశివుడు, భక్తులను కటాక్షించడం కోసం తన త్రిశూలాన్ని నేలకు తాకించాడట. అక్కడి నుంచి గంగ పొంగుతూ వచ్చి ఈ తీర్థం ఏర్పడటం వలన దీనికి 'త్రిశూల తీర్థం' అనే పేరు వచ్చింది. ఈ తీర్థంలో స్నానం చేయడం వలన, పాపాలు ... దోషాలు నశించిపోతాయి. వ్యాధులు ... బాధలు నివారించబడతాయి. సిరిసంపదలతో పాటు దీర్ఘాయువు ప్రసాదించబడుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ కారణంగానే ఈ తీర్థం మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది.