అన్నీ చేసేది ఆ పరంధాముడే !
శ్రీరామనామాన్ని జపిస్తూ కబీరు ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. తన కుటుంబం గడవడానికి అవసరమైనంత వరకూ నేత పనిచేసి, తయారుచేసిన వస్త్రాలను సంతలో అమ్మేసేవాడు. ఆయన అంత తక్కువ సంపాదనతో అంత సంతోషంగా ... సంతృప్తితో వుండటం చూసి మిగతా వ్యాపారులు ఆశ్చర్యపోతూ వుండేవాళ్లు. అలా కొంతకాలం గడిచాక ఇక అనుక్షణం రామనామంలో ... ధ్యానంలో కబీరు కాలంగడపసాగాడు.
వస్త్రాలు నేయడానికి మగ్గం దగ్గర కూర్చుని తనకి తెలియకుండానే ధ్యానంలోకి వెళ్లిపోతూ ఉండేవాడు. అయితే ఆయన ఏ రోజు మగ్గం నేయకపోయినా ... వస్త్రాల అమ్మకం చేయకపోయినా ఆ రోజు ఆ కుటుంబం పస్తులు ఉండవలసిందే. అందువలన ఆయన మగ్గం నేయడం మరిచిపోయి ధ్యానంలోకి వెళ్లగానే, సాక్షాత్తు రామచంద్రుడే వచ్చి ఆ పని పూర్తి చేసేవాడు. ధ్యానంలో నుంచి బయటికి వచ్చిన కబీర్, తానే ఆ వస్త్రాలను నేశానని అనుకునేవాడు.
సంతలో అమ్మకానికి వెళ్లినప్పుడు రాముడే వివిధ వేషాలలో వచ్చి కబీరును దానంగా వస్త్రాలను అడిగేవాడు. క్షణం కూడా ఆలోచించకుండా ఆయన ఆ వస్త్రాలను దానం చేసేవాడు. కబీర్ మంచితనం ... మానవత్వం చూసిన రాముడు తనకి మంచి భక్తుడు లభించినందుకు సంతోషంతో పొంగిపోతాడు. ఇతరులపట్ల సానుభూతి ... సహాయం చేసే లక్షణం అధికంగా వున్న వాళ్లు వ్యాపారాలు చేయలేరనే విషయాన్ని గతంలో చాలామంది భక్తులు నిరూపించారు. అలాగే కబీర్ తను నేసిన వస్త్రాలకు ఎంతిస్తే అంత తీసుకునేవాడు.
ఆయన మంచితనం కనిపెట్టిన కొందరు అతితక్కువ ధర చెల్లించి వాటిని తీసుకునేవాళ్లు. దాంతో రాముడే రంగంలోకి దిగి, వివిధ రూపాల్లో వచ్చి .. తాను తయారు చేసిన వస్త్రాలను భక్తుడి చేతుల మీదుగా తనే కొనేవాడు. అలా ఇటు భక్తుడికి కష్టం కలగకుండా వస్త్రాలను నేయడం ... అటు ఆయనకి ఆర్ధికపరమైన ఇబ్బందులు కలగకుండా వాటిని కొనుగోలు చేయడం చేస్తూ వస్తాడు. భక్తుడి విషయంలో భగవంతుడు ఎంత గొప్ప మనసును కలిగి వుంటాడనడానికి ఈ ఒక్క సంఘటనను నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.