వెన్నముద్దలో చిన్ని కృష్ణుడు !
చిన్నికృష్ణుడికి వెన్న అంటే మహా ఇష్టం ... ఆ వెన్న కోసం ఇతరుల ఇంట్లో దొంగతనాలు చేయడం ఇంకా ఇష్టం. కృష్ణుడి బారి నుంచి తమ వెన్నకుండలను కాపాడుకోవడం గోకులవాసులకు తలకి మించిన భారమయ్యేది. ఎంత ఎత్తులో ఉట్టి కట్టినా ... గోపాలకుల సహాయంతో అక్కడికి చేరుకొని కుండలన్నీ ఖాళీ చేసేవాడు. వెన్నకుండలను కాపాడుకోవడానికి వాళ్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోవడంతో, వాళ్లు యశోదా దేవికి ఫిర్యాదు చేసేవాళ్లు.
ఒకే సమయంలో అంతమంది ఇళ్లలో ఒకేసారి వెన్నను ఎలా దొంగిలించగలడు ? అంటూ యశోదాదేవి ప్రశ్నిస్తే ఆ విషయమై వాళ్లు ఆలోచిస్తూ వెనుదిరిగే వాళ్లు. అలా వెన్న విషయంలో బాలకృష్ణుడు చేసిన అల్లరిపనులు ప్రతి ఒక్కరి హృదయంలో దృశ్యరూపమై నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలో వెన్నతో ముడిపడిన కృష్ణుడి క్షేత్రం మనకి 'తిరుక్కణ్ణం గుడి' క్షేత్రంలో దర్శనమిస్తుంది. చిన్ని కృష్ణుడు చేతిలో వెన్నముద్దతో కనిపిస్తూ వుండటం సాధారణంగా జరుగుతూ వుంటుంది. అయితే వెన్నముద్దలో నుంచే కృష్ణుడు సాక్షాత్కరించిన ఈ క్షేత్రం తమిళనాడు - నాగపట్నం సమీపంలో కనిపిస్తుంది.
స్వామివారు ఇక్కడ 'శ్యామలమేని పెరుమాళ్' పేరుతో పూజలు అందుకుంటూ ఉంటాడు. పూర్వం వశిష్ఠమహర్షి ఈ ప్రదేశంలో వెన్నతో కృష్ణుడి రూపాన్ని చేసి పూజించగా, క్షణాల్లో స్వామి ప్రత్యక్షమై అనుగ్రహించినట్టు స్థలపురాణం చెబుతోంది. ఇలా వెన్నముద్ద నుంచి సాక్షాత్కరించిన కృష్ణుడి మనోహరమైన రూపాన్ని చూసి వశిష్ఠ మహర్షితో పాటు మిగతా వాళ్లంతా పరవశించిపోయారట. ఈనాటికీ ఈ కథనే గానం చేస్తూ ... భజనలు చేస్తూ భక్తులు తరిస్తుంటారు. కృష్ణుడికి వెన్నను నైవేద్యంగా సమర్పిస్తూ సంతృప్తి చెందుతుంటారు.
108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో, ఘనంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ సదర్భంగా పెద్దసంఖ్యలో తరలివచ్చే భక్తులు స్వామివారికి కానుకలు సమర్పిస్తుంటారు. వెన్నలాంటి ఆయన మనసును గెలుచుకుని సిరిసంపదలను పొందుతుంటారు.