వరాలను కురిపించే వినాయకుడు
విశిష్టమైనవిగా చెప్పబడుతోన్న 108 గణపతి రూపాలలో 'చింతామణి గణపతి' కి ఎంతో ప్రాధాన్యత వుంది. చింతామణి గణపతి అంటే ... కోరిన కోరికలు నెరవేర్చు గణపతి అని అర్థం. సహజంగానే గణపతి మంచి కార్యాలకు ఆటంకాలు ఏర్పడకుండా చూస్తూ తన భక్తులను అనుగ్రహిస్తూ వుంటాడు. ఇక చింతామణి గణపతి మరింత త్వరగా భక్తులకు వరాలను ప్రసాదిస్తాడని చెప్పబడుతోంది.
పాపాలను ... శాపాలను ... దోషాలను తొలగించడంలోను, కోరిన వరాలను కరుణతో కురిపించడంలోను చింతామణి గణపతి ప్రత్యేకతను కలిగి ఉంటాడని అంటారు. ఎంతోమంది మహర్షులు ... మహారాజులు చింతామణి గణపతిని సేవించి ఎవరు ఆశించిన వరాలను వాళ్లు పొందినట్టు ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సహజంగానే చింతామణి గణపతి ఆలయాలు అరుదుగా కనిపిస్తూ వుంటాయి. అలాంటి అరుదైన క్షేత్రాల్లో ఒకటిగా 'సిరసపల్లి' కనిపిస్తుంది.
విశాఖ జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రం, కొండల పాదభాగంలో కనిపిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ క్షేత్రం, వినాయకుడి వైభవాన్ని ప్రతిబింబిస్తూ వుంటుంది. అడుగడుగునా భక్తిభావ పరిమళాలు వెదజల్లుతూ ఇక్కడ పరివార దేవతలు కొలువుదీరి కనిపిస్తూ వుంటారు. మైసూరు దత్త పీఠంవారి అధీనంలో గల ఈ ఆలయం, ఓ వైపున ఆధునిక నిర్మాణ శైలిని ఆవిష్కరిస్తూనే మరోవైపున తపోవనాన్ని తలపిస్తూ వుంటుంది.
స్వామివారి గర్భాలయంలోకి భక్తులకు ప్రవేశం వుండటం ... స్వామికి గరికను సమర్పించడం ఇక్కడి ప్రత్యేకతలుగా కనిపిస్తూ వుంటాయి. ప్రతి బుధవారం పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శిస్తూ వుంటారు. అభిషేకాలు ... అలంకారాలు ... ప్రత్యేక ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతూ వుంటాయి. అంకిత భావంతో స్వామిని సేవించాలేగాని, ఆయన వెంటనే అనుగ్రహిస్తాడని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.