శ్రీరాముడి సరసన సీతమ్మ కనిపించని క్షేత్రం
ధర్మానికి నిలువెత్తు నిదర్శనం ... నిజమైన నిర్వచనం శ్రీరాముడు. ఎలాంటి విషమ పరిస్థితులు ఎదురైనా ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ, చివరికి ధర్మమే జయిస్తుందని లోకానికి చాటిచెప్పిన ధీరుడు ... శ్రీరాముడు. అడుగడుగునా ఆయన ఆదర్శంగా నిలిచిన కారణంగానే ప్రతి గ్రామంలోను రామాలయం కనిపిస్తుంది.
కొన్ని ఆలయాల్లో సీతారామలక్ష్మణులే తప్ప హనుమంతుడు కనిపించడు. అప్పటికి వారికి హనుమంతుడు పరిచయం కాలేదని అక్కడి స్థలపురాణం చెబుతుంది. ఇక మూలమూర్తిగా సీతమ్మవారు కనిపించని ఆలయం కూడా వుంది. అదే 'పుళ్ళం పూదం గుడి' క్షేత్రంగా అలరారుతోంది. 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం తమిళనాడు - కుంభకోణం సమీపంలో దర్శనమిస్తుంది.
సీతమ్మవారిని రావణుడు అపహరించి తీసుకువెళ్లిన తరువాత, ఆమెను అన్వేషిస్తూ శ్రీరాముడు ఈ ప్రదేశానికి చేరుకుంటాడు. ఈ కారణంగానే ఇక్కడి గర్భాలయంలో రాములవారితో సీతమ్మవారు కనిపించదని స్థలపురాణం చెబుతోంది. అమ్మవారు ఇక్కడ 'భూమాదేవి' పేరుతో ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తూ వుంటుంది. 'వల్ విలిరామన్' పేరుతో పూజలందుకునే శ్రీరాముడు, ఇక్కడ శయన ముద్రలో దర్శనమివ్వడం విశేషం.
ఈ క్షేత్రంలోనే 'జటాయువు' అనే పక్షి రాజుకి శ్రీరామచంద్రుడు మోక్షాన్ని ప్రసాదించాడు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడ జటాయువు తీర్థం కనిపిస్తుంది. అత్యంత పవిత్రమైనదిగా ... అనేక విశేషాలతో అలరారుతోన్న ఈ దివ్య క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగానే వుంటుంది. స్వామివారిని దర్శించడం వలన సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.