శని దోషం తొలగాలంటే ఏం చేయాలి ?
జీవితం ఆనందమయంగా సాగిపోతున్నంత వరకూ రోజులు చకచకా గడిచిపోతుంటాయి. ఆపదలు ... ఇబ్బందులు ఎదురైనప్పుడు మాత్రం కాలం నత్తనడక నడుస్తున్నట్టుగా అనిపిస్తూ వుంటుంది. ఇక ఈ ఆపదలు ... ఇబ్బందులు ఎదురుకావడానికి కారణం వివిధ దోషాలేనని చెప్పవచ్చు. తెలిసీ తెలియక చేసే కొన్నిరకాల పనుల వలన దోషాలు కలిగినా, చిన్న చిన్న ప్రయత్నాల వలన అవి నివారించబడుతుంటాయి.
అయితే శనిదోషం మాత్రం కాస్త గట్టిగానే పట్టుకుని వుంటుంది. చిన్న చిన్న పుణ్య కార్యాలు చేయడం వలన వచ్చే ఫలితాలు దీనిని ఎంతమాత్రం ప్రభావితం చేయలేవు. అందుకే శనిదోష నివారణ కోసం కొంతమంది ఎంత ఖర్చు అయినా చేస్తుంటారు ... ఎంత దూరమైనా వెళుతుంటారు. ఈ నేపథ్యంలో శని క్షేత్రాలను ... శైవ క్షేత్రాలను ... హనుమంతుడి క్షేత్రాలను ఎక్కువగా దర్శిస్తూ వుంటారు.
దైవానుగ్రహం కారణంగా శని తన ప్రభావాన్ని తగ్గించగలడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అలాంటి దేవతలందరూ కొలువైన ఆవును పూజించడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆవు సకల దేవతల స్వరూపమని పురాణాలు చెబుతున్నాయి. ఆవును పూజించడం వలన సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది. ఆవుకు ప్రదక్షిణ చేయడం వలన అనేక పుణ్యక్షేత్రాలకు నెలవైన భూమండలానికి ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది.
ఈ పుణ్య ఫలం కారణంగా అనేక దోషాలు తొలగిపోతాయి. అలాగే శని దోషం కూడా తొలగిపోతుందని చెప్పబడుతోంది. శనిదోషం గల వాళ్లు ప్రతి నిత్యం ఉదయాన్నే తలస్నానం చేసి ఆవును పూలమాలికలతో అలంకరించి, పసుపు కుంకుమలతో పూజించవలసి వుంటుంది. అరటి పండ్లను ... పాయసాన్ని దానికి నైవేద్యంగా సమర్పించవలసి వుంటుంది. అది నైవేద్యాన్ని ఆరగిస్తోన్న సమయంలో ప్రదక్షిణలు పూర్తిచేయాలి.
ఇక ఆవు అందరికీ అందుబాటులో వుండదు కనుక, దగ్గరలో ఎవరికైనా ఆవు వుంటే అక్కడికి వెళ్లి నేరుగా దానిని పూజించవచ్చు. లేదంటే పూజా మందిరంలో గల ఆవు చిత్ర పటాన్ని పూజించవచ్చు. వారంలో ఏదో ఒక రోజు ఆవు వున్న చోటుకి వెళ్లి దానికి నైవేద్యాలు పెట్టవచ్చు. ఆవు ఆహారానికి అవసరమయ్యే ఖర్చును భరించినా దోష నివారణ జరుగుతుంది. ఈ నియమాలను అనుసరిస్తూ గోమాతను సేవించడం వలన శనిదోష ప్రభావం తగ్గుముఖం పడుతూ తొలగిపోతుంది.