గ్రామ కుంకుమ నోము
స్త్రీల సౌభాగ్యానికి సంబంధించిన నోములలో 'గ్రామ కుంకుమ నోము'ఒకటి. భర్తను గండాల నుంచి బయటపడేయడం కోసం స్త్రీలు ఈ నోమును నోచుకుంటూ వుంటారు. ఈ నోము పట్టినవారు పసుపు ... కుంకుమ ... ఫలాలను నాలుగు వీధుల్లోనూ పెద్ద ఎత్తున పంచి పెట్టవలసి వుంటుంది. ఈ నోముకి ఉద్యాపన లేదు కాబట్టి ఎన్ని సార్లైనా నోచుకోవచ్చును. ఇక ఈ నోమును గురించిన కథను బట్టి ఇది ఎంతటి మహిమాన్వితమైనదో అర్థమవుతుంది.
పూర్వం ఓ గ్రామంలో ఆదర్శవంతులైన దంపతులు వుండేవారు. ఆ అన్యోన్య దంపతులకు ఏకైక సంతానంగా ఓ మగ బిడ్డ జన్మించాడు. ఆ తరువాత కొన్నాళ్లకు ఆ దంపతులలో భర్త తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. అతణ్ణి పరీక్షించిన వైద్యులు బతకడం కష్టమేనని పెదవి విరిచారు. ఇక జ్యోతిష్కులు కూడా అతనికి త్వరలోనే ప్రాణగండం వుందని తేల్చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో తన భక్తురాలి సౌభాగ్యాన్ని కాపాడాలని పార్వతీ దేవి నిర్ణయించుకుంది. ఆ రాత్రే ఆమె తన భక్తురాలి కలలో కనిపించి గ్రామ కుంకుమ నోము గురించి చెప్పి విధివిధానాలను వివరించింది. మరునాడు ఉదయాన్నే ఆ ఇల్లాలు గ్రామ కుంకుమ నోముకు కుంకుమ ... పసుపు ... ఫలాలను సిద్ధం చేసింది.
తూర్పు వీధిలో ... పడమర వీధిలో ... ఉత్తర వీధిలో ఆమె ముత్తయిదువులకు పసుపు కుంకుమలు పంచుతూ ఉండగానే ఆమె భర్త పరిస్థితి విషమించింది. దక్షణ వీధిలో ఆమె పంచడం పూర్తి కాగానే కొడుకు వచ్చి తండ్రి చనిపోయాడని చెప్పాడు. తాను అమ్మవారిపై పెట్టుకున్న నమ్మకం ఏనాడూ వమ్ము కాదనుకుంటూ ఆమె ఇంటికి వెళ్లింది.
ఆరోగ్యంగా కనిపిస్తూ ఆనందంగా ఎదురొచ్చిన భర్తని చూసి ఆమె ఆశ్చర్య పోయింది. తన మాంగల్యాన్ని కాపాడిన పార్వతీ పరమేశ్వరులకు మనస్పూర్తిగా నమస్కరించింది. మహాద్భుతమైన ఈ సంఘటనను గురించి విన్న వారంతా ఈ నోము నోచుకోవడం ప్రారంభించారు.