భర్తను బతికించుకున్న భార్య
జమదగ్ని మహర్షి తన సర్వశక్తులను పరశురాముడికి ధారపోస్తాడు. ఆ శక్తులను స్వీకరించి తండ్రి ఆదేశం మేరకు క్షేత్రదర్శనానికి బయలుదేరుతాడు పరశురాముడు. ఈ విషయం తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు, జమదగ్ని మహర్షి ఆశ్రమంలో వున్న కామధేనువును బలవంతంగా తీసుకువెళ్లడానికి ఇదే తగిన సమయమని భావిస్తాడు. అనుకున్నదే తడవుగా జమదగ్ని మహర్షి ఆశ్రమానికి చేరుకొని, ధ్యానంలో వున్న ఆయన్ని హతమార్చి కామధేనువును వెంటబెట్టుకుని తన రాజ్యానికి వెళతాడు.
తల్లి ఆక్రందన వినగానే పరశురాముడు ఆశ్రమానికి చేరుకుంటాడు. జరిగింది ఆమె ద్వారా తెలుసుకుని ఆగ్రహావేశాలతో రగిలిపోతాడు. అతని తండ్రి ప్రాణాలను యమధర్మరాజు తీసుకుని వెళ్లకుండా, తన పాతివ్రత్య మహిమతో వారంరోజుల పాటు అడ్డుకోగలననీ ... ఈలోగా కార్తవీర్యుడిని సంహరించి అతని గర్భాన గల అమృత భాండం తీసుకురమ్మని రేణుకాదేవి చెబుతుంది. తల్లి ఆదేశం మేరకు పరశురాముడు సరాసరి కార్తవీర్యుడి సభామందిరానికి వెళతాడు.
ధ్యానంలో వున్న తన తండ్రిని హతమార్చడం క్షత్రియ ధర్మం కాదంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. ఆశ్రమంలో అతిథుల ఆకలి తీర్చే కామధేనువును దొంగిలించడం మరో మహాపరాథమని అంటాడు. అందుకు ఫలితం అనుభవించక తప్పదంటూ కార్తవీర్యుడిపై పరశువును సంధిస్తాడు. పరశురాముడిని ఎదిరించడానికి ఆయన చేసిన ప్రయత్నం ఫలించదు.
కార్తవీర్యుడిని సంహరించి ఆయన గర్భాన గల అమృత కలశాన్ని తీసుకుని తల్లి చెప్పిన గడువు నాటికి ఆమెకి దానిని అందజేస్తాడు పరశురాముడు. ఫలితంగా జమదగ్ని మహర్షి ప్రాణాలు కాపాడబడతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్న పరశురాముడు, తన శపథం మేరకు ఇరవై ఒక్క మార్లు క్షత్రియ సంహారం చేశాక తపోభూమికి వెళ్లిపోతాడు.