కోరికలు నెరవేర్చు కొండంత దేవుడు
'ముక్కోటి ఏకాదశి' రోజున వైష్ణవ సంబంధిత ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ వుంటాయి. ఈ రోజున వైకుంఠ ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకుని మోక్షానికి అవసరమైన అర్హతను పొందుతుంటారు. మానవులు తాము చేసిన అనేక పాపాల నుంచి విముక్తిని పొందడానికి గాను, శ్రీమన్నారాయణుడే 'ఏకాదశి వ్రతం' ఏర్పాటు చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.
ఈ కారణంగానే ఈ రోజున ఉపవాసంతో వ్రతాన్ని ఆచరించి దానధర్మాలు చేస్తుంటారు. ఆ స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. అలా ఈ రోజున భక్తులతో సందడిగా కనిపించే ఆలయాల్లో ఆదిలాబాద్ - నిర్మల్ కి చెందిన 'శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం' ఒకటిగా కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో నిర్మించబడిన ఈ ఆలయం నిర్మాణ రీత్యా వేంకటేశ్వరస్వామి వైభవాన్ని ప్రతిబింబిస్తూ వుంటుంది.
విశాలమైన ప్రదేశంలో నెలకొన్న ఈ ఆలయం ప్రశాంతతకు వేదికగా కనిపిస్తూ వుంటుంది. గర్భాలయంలో నిలువెత్తు మూర్తిగా కనిపించే స్వామిని తనివితీరా చూస్తే, సమ్మోహన సౌందర్యం అనే మాటకు అర్థం తెలుస్తుంది. స్వామివారి దర్శనం కాగానే ఆయన ప్రాణంగా ఆరాధించే అమ్మవారిని దర్శించుకోవలసి వుంటుంది. అందుకే ఆ పక్కనే గల ప్రత్యేక మందిరంలో అమ్మవారు కొలువుదీరి వుంటుంది. స్వామివారి పాదాలను ఆశ్రయించిన భక్తులపై అమ్మవారు అపరిమితమైన అభిమానాన్ని కనబరుస్తుంది ... సిరిసంపదలను కురిపిస్తుంది.
ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలు ... ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక సేవలు జరుగుతుంటాయి. ఇక ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాల్లో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. ఈ ఆలయంలో అడుగు పెట్టిన భక్తులు ధర్మబద్ధమైన కోరిక కోరినట్టయితే, కొండంత దేవుడు ప్రసన్నుడై వెంటనే వాటిని అనుగ్రహిస్తాడని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.