శివుడి మెడలో కపాల మాల ?
ఐశ్వర్య కారకుడైన ఈశ్వరుడు విభూతి రేఖలు ... రుద్రాక్ష మాలలతో పాటు 'కపాల మాల' ధరించి సంచరిస్తూ వుంటాడు. స్మశాన వాటికలో తిరుగాడే శివుడు, ఎవరి కపాలాలను ధరించి ఉంటాడనే విషయం చాలామందిలో సందేహాన్ని రేకెత్తిస్తూ వుంటుంది. ఇదే సందేహం ఒక రోజున పార్వతీదేవికి కూడా కలిగిందట. శివుడు ధరించిన కపాలమాల గురించి ఆమె ఆయన్ని అడిగింది.
ఆ కపాల మాలలో వున్న కపాలాలు ఎవరివని పార్వతీదేవి అడగడంతో, ఆమె శరీరం నశించిన ప్రతిసారీ ఓ కపాలం ఆ మాలలో చేరుతుందని శివుడు సమాధానమిచ్చాడు. అంటే ఆ కపాలాలు అన్నీ కూడా గడిచిపోయిన పార్వతీదేవి అవతారాలకు సంబంధించినవిగా ఆయన స్పష్టం చేశాడు. దాంతో తన శరీరం నశిస్తూ ఉండటానికీ ... ఆయన మాత్రం జనన మరణాలకి అతీతంగా ఉండటానికి గల కారణమేమిటని పార్వతీదేవి అడిగింది.
అప్పుడు పరమశివుడు చావు పుట్టుకల మర్మాన్ని పార్వతీదేవికి తెలియజేసి ఆమె సందేహాన్ని నివృత్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం మంచుకొండల్లోని ఓ గుహను అనువైన ప్రదేశంగా ఎంచుకున్నాడు ... అదే 'అమర్ నాథ్' గా ప్రసిద్ధి చెందింది. చావుపుట్టుకల వెనుక గల రహస్యాన్ని శివుడి దగ్గర నుంచి పార్వతీదేవి తెలుసుకున్న ఈ ప్రదేశంలో ప్రతి యేటా మంచు శివిలింగం ఆవిష్కృతమవుతూ వుంటుంది.
పాలరాతి శివలింగాన్ని పాలధారలతో అభిషేకిస్తున్నట్టుగా కనిపించే అద్భుతమైన ఆ మంచు శివలింగాన్ని చూసి తీరవలసిందే. మహిమాన్వితమైన ఆ మంచు శివలింగాన్ని దర్శించుకోవడం కోసం 'శ్రావణ పౌర్ణమి' నాటికి వేల సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకుంటారు. మంచుకొండల మధ్య కొలువుండే మహాశివుడిని మంచులింగ మూర్తిగా దర్శించి తరిస్తుంటారు.