సౌభాగ్య మిచ్చే అమ్మవారు
స్త్రీలు అమ్మవారిని అధికంగా కొలుస్తూ వుంటారు. ముఖ్యంగా గ్రామదేవతలను వాళ్లు ఎంతగానో అభిమానిస్తుంటారు ... ఆరాధిస్తుంటారు. కష్టాలను తీర్చి కన్నీళ్లు తుడిచేది అమ్మవారేనని వాళ్లు బలంగా విశ్వసిస్తుంటారు. తమ సంతాన సౌభాగ్యాలను చల్లగా చూసేది ఆ తల్లేనని భావిస్తుంటారు. తమ గ్రామాన్ని సంరక్షించేది ... పాడిపంటలను కాపాడుతూ వుండేది ఆమెనని బలంగా నమ్ముతుంటారు.
ఈ కారణంగానే అమ్మవారిని తమ ఇలవేల్పుగా కొలుస్తూ తరిస్తూ వుంటారు. అమ్మవారికి చీర సారెలను సమర్పిస్తూ వుంటారు. అలా భక్తులతో నిత్య నీరాజనాలు అందుకుంటోన్న క్షేత్రం మనకి రంగారెడ్డి జిల్లా 'గాజులరామారం' లో దర్శనమిస్తుంది. సాధారణంగా అమ్మవారు వివిధ నామాలతో ... వివిధ స్వరూపాలతో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. ఈ క్షేత్రంలో అమ్మవారు ' చిత్తారమ్మ' పేరుతో పూజించబడుతోంది. చాలాకాలం క్రితమే ఇక్కడ ఆవిర్భవించిన అమ్మవారు, పసుపురంగు మోముతో ... విశాల నేత్రాలతో ... చక్కని ముక్కెరతో దర్శనమిస్తూ వుంటుంది.
విశాలమైన ప్రాంగణాన్ని ... ముఖ మంటపాన్ని కలిగివున్న ఈ ఆలయం మంగళ .. శుక్రవారాల్లో భక్తులతో సందడిగా కనిపిస్తూ వుంటుంది. అమ్మవారి అనుగ్రహాన్ని ఆశించి మొక్కుకునే వాళ్లు ... ఆమె కరుణ లభించిన కారణంగా మొక్కుచెల్లించే వాళ్లు ఎక్కువగా కనిపిస్తారు. సమస్యలు తొలగించి సంతోష సౌభాగ్యాలను ప్రసాదించే ఈ అమ్మవారి దర్శనం కోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఎక్కువగా వస్తుంటారు ... అమ్మవారి ఆశీస్సులను పొందుతూ వుంటారు.