ఆవేదన తీర్చే అయ్యప్ప క్షేత్రం
శబరిమలలో కొండలపై కొలువుదీరిన అయ్యప్పస్వామిని దర్శించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివెళుతుంటారు. అత్యంత కష్టమైన మార్గంలో నడచుకుంటూ, ఆ స్వామి భజన చేసుకుంటూ ఆయన సన్నిధికి చేరుకుంటారు. భక్తి శ్రద్ధలతో స్వామికి ఇరుముడులు సమర్పించుకుని సంతృప్తితో తిరిగి వస్తుంటారు.
అయితే చిరుమందహాసంతో ... దివ్యమైన తేజస్సుతో వెలిగిపోయే ఆ స్వామిని పదే పదే అదే పనిగా చూడాలనిపిస్తూ వుంటుంది. ఆ దివ్య మంగళమూర్తి కళ్లలోకి సూటిగా చూస్తూ, ప్రశాంతతను పొందాలనిపిస్తూ వుంటుంది. ఈ కారణంగానే శబరిమల వెళ్లి వచ్చిన భక్తులు ఒక బృందంగా ఏర్పడి, తమ ఊళ్లోనే ఆ స్వామికి ఆలయాలు నిర్మిస్తూ వుంటారు. నిజామాబాద్ జిల్లా 'బాన్సువాడ' కి చెందిన అయ్యప్పస్వామి ఆలయం కూడా ఇదే జాబితాలో మనకి కనిపిస్తూ వుంటుంది.
ఇక్కడి ఆలయం చూడగానే, దీని నిర్మాణం పట్ల భక్తులు ఎంతటి అంకిత భావాన్ని కలిగి వున్నారనేది అర్థమవుతుంది. అంతటి కుదురుగా ... అడుగడుగునా పవిత్రత ఉట్టిపడేలా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. అయ్యప్పస్వామి అన్ని ఆలయాల మాదిరిగానే ఇక్కడి ఆలయంలో, గర్భాలయానికి ఎదురుగా 18 మెట్లు ఏర్పాటు చేయబడి వుంటాయి. గర్భాలయంలో స్వామి, దర్శన మాత్రం చేతనే మానసిక ప్రశాంతతను ప్రసాదించి ఆవేదన తీర్చేలా కనిపిస్తుంటాడు.
ఇక్కడి స్వామిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు. స్వామిని విశ్వసించి సమస్యల సుడిగుండంలో నుంచి బయటపడిన వాళ్లు, అనునిత్యం స్వామిని సేవించి తరిస్తుంటారు. ప్రతి బుధవారం స్వామికి పంచామృత అభిషేకం నిర్వహిస్తుంటారు. ఈ అభిషేక జలాన్ని భక్తులు తీర్థంగా స్వీకరిస్తుంటారు. ఇదే ప్రాంగణంలో గణపతి ... సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు వుండటం వలన ఈ క్షేత్రం మరింత విశిష్టతను సంతరించుకుని విలసిల్లుతోంది.