శ్రీవారి పూలమాలలను స్వీకరించే బావి
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నాక, జన్మకి సార్థకత లభించినట్టు అనిపిస్తుంది. అనేక రకాల పూలమాలికల అలంకరణలతో ... వివిధ రకాల వాహనాలపై ఉత్సాహంగా ఊరేగే స్వామివారిని చూడటాన్ని అందరూ అరుదైన అదృష్టంగా భావిస్తుంటారు.
స్వచ్చంగా ... పరమ పవిత్రంగా కనిపించే పూలమాలికలు ధరించడం వలన స్వామివారి సౌందర్యం పెరిగిందా ? లేదంటే ఆ జగన్నాథుడి జత చేరిన కారణంగా ఆ పూలమాలికలు మరింత అందాన్ని సంతరించుకున్నాయా? అనే సందేహం కలుగుతూ వుంటుంది. ఏడాది పొడవునా తిరుమలలో స్వామివారికి అలంకరణలు ... ఉత్సవాలు జరుగుతూనే వుంటాయి.
స్వామివారిని సమ్మోహనంగా ఆవిష్కరించే ఈ పూలమాలలను ఆ తరువాత ఏం చేస్తారనే సందేహం చాలామందికి కలుగుతూ వుంటుంది. స్వామివారిని అలంకరించిన పూలమాలికలను సేవల అనంతరం ఆలయ ప్రాంగణంలో గల 'బావి'లో వేస్తుంటారు. ఈ కారణంగానే దీనిని 'పూలబావి' అని పిలుస్తూ వుంటారు. తొండమాన్ చక్రవర్తి కాలంలో ఈ బావిలో గల నీటిని పూలమొక్కల పెంపకానికి ఉపయోగించేవారు.
ఈ నీటితో పెరిగిన తోట నుంచే స్వామి అలంకారానికి కావలిసిన వివిధ రకాల పూలు వచ్చేవి. ఆ తరువాత కాలంలో ఈ బావిలో నీరు లేకపోవడంతో, స్వామివారి నిర్మాల్యాలు ఇందులో వేయడం మొదలైంది. అయితే ఒకానొక సందర్భంలో భూదేవి అమ్మవారు ఈ బావిలో కొలువైందనీ, స్వామి ధరించిన పూలమాలలను అమ్మవారికి అర్పించడం కోసమే ఈ బావిలో వాటిని వేస్తూ ఉంటారనే కథనం కూడా ప్రచారంలో వుంది.