తీర్థం మూడుసార్లు తీసుకోవాలా?

తీర్థం మూడుసార్లు తీసుకోవాలా?
భక్తి అనేది మనసుకి ప్రశాంతతను కలిగిస్తుంది ... దేవుడు అండగా వున్నాడనే ధైర్యంతో ముందుకు నడిపిస్తుంది. అలా దైవానుగ్రహాన్ని కోరుకునే వాళ్లందరూ ఆలయానికి వెళ్లి ఆ స్వామిని పూజిస్తుంటారు ... సేవిస్తుంటారు. ఆలయానికి వెళ్లగానే ముందుగా ప్రదక్షిణ చేసి ఆ తరువాత ముఖమంటపంలోకి చేరుకుంటారు ... గోత్రనామాలతో అర్చన చేయిస్తారు.

పూజ పూర్తయిన తరువాత పూజారి తీర్థాన్ని ఇస్తాడు. ఈ నేపథ్యంలో కొందరు ఒకసారి మాత్రమే తీర్థాన్ని తీసుకుంటే, మరికొందరు మూడుసార్లు తీర్థం తీసుకుంటూ వుంటారు. ఒకసారి తీర్థం స్వీకరించడం వలన ... మూడుసార్లు స్వీకరించడం వలన ఒకే ఫలితం ఉంటుందని చాలా మంది భావిస్తూ వుంటారు. గృహస్తులు తీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలని శాస్త్రం చెబుతోంది.

తీర్థాన్ని తీసుకునేటప్పుడు స్త్రీలయితే చీర కొంగును ... పురుషులైతే కండువాను ఎడమ అరచేతికి కుడి అరచేతికి మధ్య వుంచి తీర్థం స్వీకరించాలని అంటోంది. మూడుసార్లు తీర్థం తీసుకోవడం వలన, వెనుక మూడు జన్మాల్లో చేసిన పాపాలు నశిస్తాయని సెలవిస్తోంది. మోక్ష సాధనానికి అడ్డుగా నిలిచే వ్యామోహం ... ధనదాహం ... అహంకారం వంటి వాటిని హరింపజేస్తుందని చెబుతోంది. ఇలా మూడు విధాలైన తాపాలను నశింపజేయడమే మూడు సార్లు తీర్థం తీసుకోవడంలోని పరమార్థమని స్పష్టం చేస్తోంది.

More Bhakti Articles