శివలీలా విశేషం
యుగయుగాలుగా మహాశివుడు తన లీలా విశేషాలను అత్యద్భుతంగా ఆవిష్కరిస్తూనే వస్తున్నాడు. తనని శరణు కోరిన భక్తులను కరుణతో అనుగ్రహిస్తూనే వస్తున్నాడు. ఈ కారణంగానే సదాశివుడు ఎక్కడ ఆవిర్భవించినా, ఆయన్ని వెతుక్కుంటూ భక్తులు వెళుతుంటారు. మంచులాంటి మనసున్న ఆ స్వామికి పూజాభిషేకాలు జరిపించి కృతజ్ఞతలు తెలుపుకుంటారు.
పరమశివుడు ఆవిర్భవించిన పుణ్య క్షేత్రాల్లో పంచభూత లింగాలకు మరింత విశిష్టత వుంది. పంచభూత లింగాల్లో ఒకటైన 'వాయులింగం' శ్రీకాళహస్తి లో దర్శనమిస్తుంది. సాధారణంగా గర్భాలయాల్లోకి గాలి రాదు. అందువలన గర్భాలయంలోని దీపం నిశ్చలంగా వెలుగుతూ వుంటుంది. అయితే శ్రీకాళహస్తి స్వామి వారి గర్భాలయంలో స్వామివారికి ఇరువైపులా గల దీపాలు గాలికి రెపరెపలాడుతూ వుంటాయి.
సదాశివుడు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనీ, ఆయన శ్వాసిస్తూ వుండటం వల్లనే ఈ దీపాలు రెపరెపలాడుతున్నాయని చెబుతారు. ఇక కొన్ని క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాదులు నిర్వహిస్తారు. మరికొన్ని క్షేత్రాల్లో భక్తులకు కూడా అభిషేకం చేసే అవకాశం వుంటుంది. కానీ అందుకు పూర్తి భిన్నమైనదిగా శ్రీకాళహస్తిలోని శివలింగం కనిపిస్తుంది.
మహిమాన్వితమైన ఈ శివలింగాన్ని ప్రధాన అర్చకులతో సహా ఇంతవరకూ ఎవరూ తాకకపోవడం విశేషం. ఇక్కడ ఉత్సవ మూర్తికి మాత్రమే అభిషేకం జరుపుతుంటారు. సాక్షాత్తు పార్వతీదేవికి పరమశివుడు ఇక్కడే పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడని అంటారు. అలాంటి మహిమాన్వితమైన ఈ క్షేత్రం దర్శనం మాత్రం చేతనే ధన్యులను చేస్తుందని చెబుతారు.