స్వామి కోసం వచ్చిన అమ్మవారు
వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడి ప్రధాన దైవం అయ్యవారు అయితే, ఆ పక్కనే గల ప్రత్యేక మందిరంలో అమ్మవారిని కూడా ప్రతిష్ఠించి పూజిస్తుంటారు. అలాగే ప్రధానదైవం అమ్మవారైతే, ప్రత్యేక మందిరంలో అయ్యవారిని ప్రతిష్ఠించి ఆరాధిస్తుంటారు. ఈ విధంగా అయ్యవారినీ ... అమ్మవారిని ఒకేచోట దర్శించి సేవించడం వలన పరిపూర్ణమైన ఫలితం దక్కుతుందని చెబుతుంటారు.
అయితే స్వామివారిని ప్రతిష్ఠించాలని భక్తులు అనుకుంటే, తాను కూడా ఉన్నానంటూ అమ్మవారు శిలా రూపంలో కదిలి వచ్చిన సంఘటన హైదరాబాద్ - రాజేంద్రనగర్ లో జరిగింది. ఇక్కడి వ్యవసాయ విశ్వ విద్యాలయం సమీపంలో 'వెంకన్నగుట్ట' దర్శనమిస్తుంది. ఈ గుట్టపై శ్రీ వేంకటేశ్వరస్వామి అమ్మవారితో పాటు కొలువై భక్తులను అనుగ్రహిస్తుంటాడు. పూర్వం ఇక్కడి గుట్టపై భూగర్భంలో హనుమంతుడి విగ్రహం లభించింది.
దాంతో ఆ ప్రదేశంలో గ్రామస్తులు తవ్వకాలు జరపగా వేంకటేశ్వర స్వామివారి మూర్తి లభించింది. అమ్మవారి ప్రతిమ దొరుకుతుందేమోనని గ్రామస్తులు ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. దాంతో గ్రామస్తులు స్వయంభూ హనుమంతుడిని ప్రతిష్ఠించారు. ఆ తరువాత వేంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠిస్తూ వుండగా, గుట్ట పై భాగంలో గల ఓ బండ రాయి దొర్లుకుంటూ వచ్చి స్వామివారి ప్రతిమ పక్కన నిలిచిందట. మహిమాన్వితమైన ఈ దృశ్యం చూసిన వాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
అలా శిలా రూపంలో దొర్లుకుంటూ వచ్చి ఆగింది అమ్మవారేనని అంతా భావించారు. స్వామితో పాటు తనని కూడా ప్రతిష్ఠించి పూజించుకోమని చెప్పడమే అందులోని అంతరార్ధమని గ్రహించారు. ఆ శిలను స్వామివారి పక్కనే ప్రతిష్ఠించి పూజించాలని అంతా కలిసి నిర్ణయించుకున్నారు. ఫలితంగానే ఈ రోజున చక్కగా తీర్చిదిద్దబడిన ఆలయంలో అమ్మవారు ... అయ్యవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారు తనంతట తానుగా వెలుగుచూసింది కనుక, ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు సంతాన సౌభాగ్యాలను ప్రసాదిస్తూ ఉంటుందని స్థానికులు చెబుతుంటారు.